News


చెల్లించాల్సింది రూ.25-30 కోట్లు

Tuesday 26th November 2019
news_main1574738431.png-29848

  • వారంలోగా తిరిగి చెల్లించేస్తాం
  • కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25-30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు 150-180 మంది క్లయింట్ల బకాయిలని తెలియజేశారు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ విభాగానికి నిధులు మళ్లాయన్న ఎన్‌ఎస్‌ఈ ఆరోపణల నేపథ్యంలో.. గ్రూప్‌నకు హోల్డింగ్‌ కంపెనీ కేఎస్‌బీఎల్‌ కాబట్టే దాన్నుంచి నిధులు బదలాయించినట్లు చెప్పారు. పలు అనుబంధ కంపెనీల్లో కేఎస్‌బీఎల్‌ పెట్టుబడులున్నాయని గుర్తు చేశారు. కంపెనీ వాదన వినకుండానే సెబీ ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ... దీనిపై సెబీని సంప్రతిస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్‌, దాని అనుబంధ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 



You may be interested

సాల్‌కాంప్‌ చేతికి నోకియా చెన్నై ప్లాంటు

Tuesday 26th November 2019

పదేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న ఫ్యాక్టరీ 2020 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్‌కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన సోమవారం తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని

క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో

Tuesday 26th November 2019

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్‌ సేవలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్‌, పీక్‌టైం, సర్జ్‌ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఇన్‌డ్రైవర్‌’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్‌ నుంచి ఎలాంటి కమిషన్‌ తీసుకోదు. కస్టమర్‌ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి.

Most from this category