News


వచ్చే ఏడాది జియో ఐపీఓ?!

Friday 21st June 2019
news_main1561131474.png-26479

వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో జియోను పబ్లిక్‌ ఆఫర్‌కు తెచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అయితే అంతకన్నా ముందు తమ టవర్లు, ఫైబర్‌ అసెట్ల నిర్వహణ చూస్తే ఇన్విట్స్‌కు ఇన్వెస్టర్లను తీసుకురావాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది. గతవారం జియో ఐపీఓ యత్నాలు జోరందుకున్నాయని సంకేతమిచ్చే పలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో టెలికం వినియోగదారుల పరంగా టాప్‌లోకి వస్తామని జియో వివిధ బ్యాంకర్లకు తెలియజేసింది. ఇదే జరిగితే కంపెనీ రెవెన్యూ పెరగడంతో పాటు ఐపీఓ విజయవంతంగా సబ్‌స్క్రైబ్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యాంకర్లు మాత్రం కంపెనీ ఏఆర్‌పీయూ పడిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాయని తెలిసింది. జియో ఏఆర్‌పీయూ వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా క్షీణత నమోదు చేసింది. మరోవైపు పోటీ కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియాల ఏఆర్‌పీయూ జియో కన్నా తక్కువగా ఉన్నా, క్రమానుగతంగా మెరుగుపడుతోంది. మరోవైపు ఇటీవలే వేరు చేసిన జియో డిజిటల్‌ ఫైబర్‌, జియో ఇన్‌ఫ్రాటెల్‌ కంపెనీలకు తగిన పెట్టుబడులు వచ్చాకే జియో ఐపీఓ తీసుకువస్తామని ఆర్‌ఐఎల్‌ చెబుతోంది. నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్‌ ఫలితాల ప్రకటన ఆరంభించిన మూడేళ్ల తర్వాత కానీ ఏ కంపెనీఐనా ఐపీఓకి వచ్చేందుకు వీల్లేదు. ఈ ప్రకారం జియో ఐపీఓ 2020 మార్చి తర్వాతే సాధ్యమవుతుంది. మోయిలిస్‌, ఐసీఐసీఐ, సిటి సంస్థలు జియో ఇన్విట్స్‌కు పెట్టుబడిదారులను సమకూర్చే మేనేజర్లుగా నియమితమయ్యాయి. ఇవే సంస్థలు జియో ఐపీఓకి మేనేజర్లుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. 



You may be interested

ట్రేడ్‌వార్‌ కంటే ఆయిల్‌, రూపీ పెద్ద రిస్క్‌లు!

Saturday 22nd June 2019

పన్ను తగ్గింపులు, గ్రామీణ, చిన్న, పెద్ద పట్టణాల్లో వినియోగానికి ఊతమిచ్చే నిర్ణయాలు వచ్చే నెల కేంద్ర బడ్జెట్‌లో ఉండొచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ మయురేష్‌ జోషి అంచనా వేశారు. వ్యక్తులకు సంబంధించి పన్న రేట్ల కోత ఉండొచ్చని, పలు మినహాయింపులతోపాటు భారీ ఉద్యోగాలు కల్పించే ఎంఎస్‌ఈ, ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఉండొచ్చన్నారు. అజెండాలో కార్పొరేట్‌ పన్ను కోత ఉన్నప్పటికీ, నిధుల సమీకరణ లక్ష్యాలపై ఉన్న ఒత్తిళ్లు

లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Friday 21st June 2019

మార్కెట్‌ నిన్నటి ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాలన్ని నేడు హరించుకుపోయాయి. ఫలితంగా సూచీలు లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్లను నష్టపోయి 39,194 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 107 పాయింట్లను కోల్పోయి 11750ల దిగువను 11,724 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆందోళనలు సూచీల నష్టాల ముగింపు కారణమయ్యాయి. నేడు కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్‌ అధ్యక్షతన

Most from this category