పారదర్శక విధానాలు అమలు చేయండి
By Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి తావులేని పారదర్శక విధానాలు అమలు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు, దేశీ తయారీ రంగ ఎగుమతుల సంస్థలు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్, సబ్సీడీల మీద ఆధారపడుకుండా స్వీయ వృద్ధిపై దృష్టి సారించాలన్నారు. దేశంలో తయారీ రంగం వృద్ధి, అంతర్జాతీయంగా మేకిన్ ఇండియాకు ప్రాచుర్యం కల్పించడంపై నూతన విధానాల రూపకల్పనకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. దీనికి పరిశ్రమ ప్రతినిధులతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పియూష్ గోయల్ మాట్లాడుతూ.. పరిశ్రమ వర్గాలు గ్రాంట్స్ మీద ఆధారపడకుండా పోటీతత్వంతో స్వీయవృద్ధి మీద దృష్టి సారించాలన్నారు. ఉత్పాదకత పెంపు వల్లనే ఈ రోజు ఎల్ఈడీ బల్బులు ప్రజలకు అందుబాటు ధరలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని, ఈ తరుణంలో ప్రపంచంతో అనుసంధానం ఏర్పచుకొనేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ కారద్యర్శి రజత్ భార్గవ్ పాల్గొన్నారు.
You may be interested
నాట్కో కొత్తూరు యూనిట్లో ఉల్లంఘనలు
Friday 7th June 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మాకు చెందిన కొత్తూరులోని ఫార్ములేషన్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేపట్టింది. మే 30 నుంచి జూన్ 5 వరకు జరిగిన ఈ తనిఖీల్లో తయారీ కేంద్రంలో పలు ఉల్లంఘనలు జరిగినట్టు ఎఫ్డీఏ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తొమ్మిది అంశాలను లేవనెత్తుతూ ఫెడరల్ ఫుడ్, డ్రగ్, కాస్మెటిక్ యాక్టు కింద కంపెనీకి ఫామ్-483 జారీ చేశారు. ఎఫ్డీఏ లేవనెత్తిన అంశాలకు
భారత్కు రూ. 90వేల కోట్ల నష్టం
Friday 7th June 2019ఎగుమతులు, దిగుమతుల్లో తప్పుడు బిల్లింగ్లే కారణం గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ నివేదిక న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల వాణిజ్య లావాదేవీల్లో తప్పుడు ఇన్వాయిస్ల కారణంగా 2016లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. పన్ను ఆదాయాలపరంగా వాటిల్లిన ఈ నష్టం సుమారు రూ. 90,000 కోట్లు (13 బిలియన్ డాలర్లు) ఉంటుందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఇది 2016లో వసూలైన మొత్తం ఆదాయంలో దాదాపు