News


భారత్‌-బ్రెజిల్‌ వాణిజ్య పటిష్టతకు చర్యలు: గోయెల్‌

Tuesday 28th January 2020
news_main1580181505.png-31252

  • రెండు దేశాల అధికారుల విందు సమావేశంలో ప్రసంగం
  • బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణకు ప్రతిపాదన

న్యూఢిల్లీ: భారత్‌ - బ్రెజిల్‌ మధ్య వాణిజ్య పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయెల్‌ సూచించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇండియా-బ్రెజిల్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణ, ఫోరమ్‌ క్రియాశీలతకు చర్యలు అవసరమని బ్రెజిల్‌కు సూచించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో సమక్షంలో ఇరు దేశాల అధికారుల విందు సమావేశంలో గోయెల్‌ ప్రసంగించారు. ‘‘ఇండియా-బ్రెజిల్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనను పరిశీలించాలని బ్రెజిల్‌ గౌరనీయ అధ్యక్షుడిని, అలాగే ఇరుదేశాల వ్యాపారవేత్తలు, అధికారులకు నేను విజ్ఞప్తి చేశాను. కొద్ది సంవత్సరాల క్రితం ఫోరమ్‌ను ప్రారంభించడం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ఫోరమ్‌ అడుగులు ముందుకు పడలేదు’’ అని గోయెల్‌ అన్నారు. 

15 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం...
రైల్వేలు, మౌలికరంగం, రవాణా, వ్యవసాయం, క్లీన్‌ ఎనర్జీ, స్టార్టప్స్‌ వంటి విభాగాల్లో రెండు దేశాల పరస్పర సహకారానికి అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 8.3 బిలియన్‌ డాలర్లు. 2020 నాటికి ఈ పరిమాణం 15 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని రెండు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన బ్రెజిల్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ, బ్రెజిల్‌లో భారత్‌ వ్యాపారాలకు తగిన భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. పరస్పర వాణిజ్య అవకాశాల పెంపునకు ఇరు దేశాల కృషి అవసరమని అన్నారు. మరోవైపు బ్రెజిల్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు అసోచామ్‌ ప్రకటించింది. బ్రెజిల్‌ అధ్యక్షుని పర్యటన సందర్భంగా పెట్టుబడులు, బయో ఇంధనం, చమురు గ్యాస్‌లపై పరస్పర సహకారం, సామాజిక భద్రతాంశాల పురోగతి వంటి అంశాలపై ఐదు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. You may be interested

నిఫ్టీ మద్దతు 12,078

Tuesday 28th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు మైనస్‌ అమెరికా, ఆసియా మార్కెట్లు పతనం ఇతర దేశాలకూ పాకుతున్న కరోనా వైరస్‌  నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 26 పాయింట్లు నీరసించి 12,094  వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,119 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

పట్టణ సహకార బ్యాంకుల్లో మోసాలు వెయ్యి

Tuesday 28th January 2020

‘పంచవర్ష’ పాపమిది ఆర్‌బీఐ గణాంకాల వెల్లడి విలువ రూ.220 కోట్లు న్యూఢిల్లీ: పట్టణ సహకార బ్యాంకుల్లో గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో దాదాపు 1,000 మోసాలు చోటుచేసుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మోసాల విలువ దాదాపు రూ.220 కోట్లని పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఆర్‌బీఐ అందించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2018-19 మధ్య కాలంలో జరిగిన మోసాల సంఖ్య 181. వీటి విలువ

Most from this category