News


ఈ-కామర్స్ విధానంపై కసరత్తు

Wednesday 19th June 2019
news_main1560926650.png-26408

 

  • పరిశ్రమ వర్గాల అభిప్రాయాలకు 10 రోజులు

న్యూఢిల్లీ: జాతీయ ఈ-కామర్స్ విధానం రూపకల్పనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన ముసాయిదాపై పది రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్ సూచించారు. ఇప్పటికే ఈ- కామర్స్‌, టెక్నాలజీ పరిశ్రమ వర్గాలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు డేటా భద్రత సహా మరికొన్ని అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారని, 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విధానం ప్రోత్సాహక విభాగానికి (డీపీఐఐటీ) తమ అభిప్రాయాలు తెలపాలంటూ సూచించారని పేర్కొంది.  



You may be interested

బడ్జెట్‌పై ట్విట్టర్ క్విజ్ ప్రారంభించిన ఆర్థిక శాఖ

Wednesday 19th June 2019

న్యూఢిల్లీ: బడ్జెట్‌పై ప్రజల్లో ఆసక్తిని పెంచడంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై క్విజ్‌ సిరీస్‌ను ప్రారంభించింది. ట్విట్టర్ వేదికగా మొదలైన ఈ క్విజ్‌లో మొత్తం నాలుగు మల్టీపుల్‌ ఆప్షన్లతో మంగళవారం తొలి ప్రశ్నను సంధించింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ బడ్జెట్ ఎప్పుడు సమర్పించారనే ప్రశ్నను వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన జ్ఞానాన్ని ప్రజలు మరోసారి మననం చేసుకోవడానికి ఇది సరైన వేదికగా భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఈ

బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

Wednesday 19th June 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఆర్ధిక సంవత్సరంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వాణిజ్య వాహనమైన బొలెరో అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో 1.62 లక్షల వాహనాలను, 2018 ఆర్ధికంలో 1.49 లక్షలను విక్రయించామని.. ఏడాదిలో 9 శాతం వృద్ధిని నమోదు చేశామని ఎం అండ్‌ ఎం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌– ఆటోమోటివ్‌ డివిజన్‌) విక్రమ్‌ గార్గా తెలిపారు. మంగళవారం కొత్త బొలెరో క్యాంపర్‌ను

Most from this category