News


ప్రభుత్వ బ్యాంకుల్లో పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు.!

Tuesday 19th November 2019
Markets_main1574150958.png-29703

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి..
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు పనితీరు ఆధారంగానే ప్రోత్సాహకాలను చెల్లించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలను అందిస్తున్నారు. ‘‘ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలు’’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు పీఎస్‌యూ బ్యాంకులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉన్నతస్థాయి అధికారులకు ఈ పద్దతిని అమలు చేసే యోచనలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో పనితీరు ఆధారంగా వేరియబుల్‌ పే అనే విధానం అమల్లో ఉంది. మంచి పనితీరు కనబర్చిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో విశ్లేషించి చూస్తే కేవలం కోల్‌ ఇండియాలో మాత్రమే ఈ విధానం అమల్లో వుంది. ఇటీవల ఏడో వేతన సవరణ కమిషన్‌ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరు ఆధారిత చెల్లింపుల విధానాన్ని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 

ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహక ప్రతిపాదన:- 
పెర్ఫార్మన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) గా పేర్కొనే కొత్త విధాన ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రముఖ బ్యాంకు యూనియన్ లు అన్ని కూడా సూత్రప్రాయంగా తమ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో పని తీరు ఆధారిత బోనస్, ఇతర ప్రోత్సాహక చెల్లింపు విధానం అమలు చేయటం కేవలం లాంఛనం మాత్రమేనని బ్యాంకింగ్‌ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ కమిటీకి బ్యాంకుల తరఫున యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజకిరణ్ రాయి సారథ్యం వహిస్తున్నారు. 11 వ వేతన సవరణ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే 2017 నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై తర్వలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Tuesday 19th November 2019

ప్రభుత్వరంగ షేర్లు మంగళవారం మార్కెట్‌ ప్రారంభం నుంచి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 4.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మొత్తం 12షేర్లు 2శాతం నుంచి 16శాతం వరకు ర్యాలీ చేశాయి. అత్యధికంగా అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేరు 16శాతం లాభపడింది. సిండికేట్‌ బ్యాంక్‌ 15శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 10వాతం, యూనియన్‌ బ్యాంక్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు

Tuesday 19th November 2019

దేశీయ ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మంగళవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేయడంతో పాటు రూ. 1,500 స్థాయిని అధిగమించింది. బీఎస్‌లో ఎక్చ్సేంజీలో నేడు ఈ కంపెనీ షేరు రూ.1467.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ 01 నుంచి ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు కాల్‌ సర్వీసు ఛార్జీలు పెంచనున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సైతం సంస్థ జియో సైతం ఛార్జీలను పెంచవచ్చనే

Most from this category