News


అజయ్‌ పిరమళ్‌ చేయి వేస్తే...,

Tuesday 18th June 2019
news_main1560840177.png-26380

  • 2013లో  10 శాతం వాటా కొనుగోలు 
  • రూ.1,652 కోట్లకు కొన్న అజయ్‌ పిరమళ్‌ 
  • ఇప్పుడు దీనిని రూ.2,305 కోట్లకు విక్రయం 
  • ఆరేళ్లలో రూ.  653 కోట్ల లాభం... 40 శాతం రాబడులు 

ముంబై: అజయ్‌ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్‌ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000-1,015 రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్‌లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. 


అజయ్‌ పిరమళ్‌కు చెందిన పిరమళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇతర శ్రీరామ్‌ గ్రూప్‌ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌లో 10 శాతం, శ్రీరామ్‌ క్యాపిటల్‌లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్‌ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్‌, ఎలిలిల్లీ, ఫైజర్‌, అబాట్‌, బయో-సింటెక్‌, బేయర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. 



You may be interested

యశోవర్థన్‌ బిర్లా.. రుణ ఎగవేతదారు !

Tuesday 18th June 2019

ప్రకటించిన యూకో బ్యాంక్‌ న్యూఢిల్లీ: యశోవర్థన్‌ బిర్లాను రుణ ఎగవేతదారుగా యూకో బ్యాంక్‌ ప్రకటించింది. బిర్లా సూర్య లిమిటెడ్‌ కంపెనీ కోసం యశోవర్థన్‌ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకున్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించకపోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని యూకో బ్యాంక్‌ తెలిపింది. 2013లోనే ఈ రుణాన్ని మొండి బకాయిగా గుర్తించామని, అప్పటి నుంచి ఈ రుణాన్ని చెల్లించాల్సిందిగా పలు నోటీసులు పంపించామని, కానీ ఆయన స్పందించలేదని

మేలో నియామకాల వృద్ధి 11 శాతం

Tuesday 18th June 2019

 ఐటీలో పెరిగిన ఉద్యోగాలు న్యూఢిల్లీ: దేశీయంగా గతనెల్లో ఉద్యోగుల నియామకాలు 11 శాతం వృద్ధి చెందినట్టు నౌకరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించే నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌.. మే నెల్లో 2,346 వద్దకు చేరుకుంది. గతేడాది ఇదేకాలంలో 2,106 ఉండగా.. ఏడాది ప్రాతిపదికన పదకొండు శాతం వృద్ధిని నమోదుచేసింది. ఐటి-సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగాలు ఈ సూచీని ఇంతటి స్థాయికి చేర్చినట్లు వెల్లడించింది. ఈ రంగంతో పాటు

Most from this category