News


పిరమల్‌ రూ.1,500 కోట్ల ఎన్‌సీడీల సమీకరణ

Monday 22nd July 2019
Markets_main1563779481.png-27224

అజయ్ పిరమల్ నియంత్రణలో ఉన్న పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఎన్‌సిడి) ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.1,500 కోట్లు సమీకరించిందని పరిశీలకులు తెలిపారు. పిరమల్‌ గ్రూప్‌కు చెందిన పిరమల్‌ క్యాపిటల్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల కార్యక్రమాల మూలధన అవసరాలను తీర్చడానికి కూడా ఈ మొత్తాన్ని ఉపయోగిచంనున్నామని పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ తెలిపింది. దీంతోపాటు జనవరి 2020 లో తిరిగి చెల్లించవలసిన  కాల-సంబంధిత రుణ చెల్లింపులకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. గత వారంలో, పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సంస్థ రూ. 1,700 కోట్ల విలువైన బకాయిలపై ప్రధాన, కూపన్ చెల్లింపులు చేసింది.   రూ 1,000 కోట్ల విలువైన ఎన్‌సీడీలను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుం‍చి, రూ.590 కోట్ల విలువైన ఎన్‌సిడిలను డ్యూయిష్ బ్యాంక్ నుంచి  2016 లో పొందిన విషయం తెలిసిందే. 



You may be interested

కేజీ డీ6లో కనిష్ట స్థాయికి గ్యాస్

Monday 22nd July 2019

న్యూఢిల్లీ: గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో కేజీ-డీ6 బ్లాక్ ప్రస్తుతం చివరి దశలో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. గ్యాస్ ఉత్పత్తికి కావల్సినంత పీడనం లేకపోవడం, బావుల్లో నీరు చొరబడటం తదితర అంశాలు ఉత్పత్తి భారీగా పడిపోవడానికి కారణాలని వివరించింది. అయితే, కేజీ-డీ6 బ్లాక్‌లో పరిస్థితులను మళ్లీ మెరుగుపర్చేందుకు 2020 మధ్య నాటి నుంచి మూడు కొత్త ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభించే ప్రక్రియ చేపడుతున్నట్లు జూన్

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

Monday 22nd July 2019

భారత్‌లో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన ఏడీబీ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం అంచనాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా 0.2 శాతం తక్కువగా 4.1 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉండగలదని వివరించింది. రూపాయి బలపడటం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)అంచనాలు తగ్గడం తదితర అంశాలు ద్రవ్యోల్బణ తగ్గుదలకు కారణాలు కాగలవని ఏడీబీ

Most from this category