News


శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లో మొత్తం వాటా అమ్మేసిన పిరమల్‌

Monday 17th June 2019
news_main1560753427.png-26347

 శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌(ఎస్‌టీఎఫ్‌సీ)లోని తమ మొత్తం వాటాను పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 2,305కోట్లకు విక్రయించింది. ‘శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లోని తమ 9.96శాతం ప్రత్యక్ష పెట్టుబడులను స్టాక్‌ ఎక్సెంజ్‌ల ద్వారా థర్డ్‌పార్టీ ఇన్వెస్టర్ల్‌కు అమ్మేశాం’ అని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2019 మార్చి 31 నాటికి పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ వద్ద 2.26కోట్ల  శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ షేర్లున్నాయి. సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ షేరు విలువ రూ.1,038గా ఉంది. దీని ప్రకారం లెక్కిస్తే తాజా డీల్‌ విలువ రూ.2305 కోట్లుంటుంది. పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ షేరు విలువ బీఎస్‌ఈలో 0.27శాతం పెరిగి రూ.2,074గా ట్రేడవుతోంది.



You may be interested

7శాతం నష్టపోయిన ఎస్‌టీఎఫ్‌సీ షేరు

Monday 17th June 2019

 పిరమల్‌ ఎంటర్‌ ప్రైజస్‌ సంస్థ శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌(ఎస్‌టీఎఫ్‌సీ)లోని తమ పూర్తి వాటాను విక్రయించడంతో ఎస్‌టీఎఫ్‌సీ షేరు విలువ సోమవారం 7శాతం నష్టపోయి రూ.1,011 వద్దకు చేరింది.  ‘శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లోని తమ 9.96శాతం ప్రత్యక్ష పెట్టుబడులను స్టాక్‌ ఎక్సెంజ్‌ల ద్వారా థర్డ్‌పార్టీ ఇన్వెస్టర్ల్‌కు అమ్మేశాం’ అని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎస్‌టీఎఫ్‌సీ 3.97శాతం నష్టంతో రూ.1,038 వద్ద ట్రేడయ్యింది. పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌

స్థిరంగా పసిడి ధర

Monday 17th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర  1.35డాలరు స్వల్ప నష్టంతో 1,343.15 కదలాడుతోంది. ఇన్వెస్టర్లు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో​కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా మే నెల రిటైల్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయిల రికవరిని సాధించింది.

Most from this category