News


పిచాయ్‌కు అదిరిపోయే ప్యాకేజీ

Saturday 21st December 2019
news_main1576922108.png-30356

వేతనం కాకుండా దాదాపు రూ. 1700 కోట్ల ప్యాకేజీ
ఆల్ఫాబెట్‌ కొత్త సీఈఓ సుందర్‌పిచాయ్‌కు బంపర్‌ ప్యాకేజీని కంపెనీ ఆఫర్‌ చేసింది. 2020లో వార్షిక వేతనం 20 లక్షల డాలర్లతో పాటు 24కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,700 కోట్లు) విలువైన స్టాక్‌ ప్యాకేజీని అందించనుంది. ఆల్ఫాబెట్‌ మరియు గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు పెరిగినందున సుందర్‌కు ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు కంపెనీ అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌కు తెలిపింది. ఈ మొత్తం ఆయనకు మూడేళ్లలో వివిధ దశల్లో అందుతుంది. ఇందులో 9 కోట్ల డాలర్లు 2020-22 కాలంలో ఆల్ఫాబెట్‌ షేరు ఎస్‌అండ్‌పీ 100లో చూపే ప్రదర్శన ఆధారంగా పిచాయ్‌కు అందజేస్తారు. ప్రస్తుత వృద్ధి రేటుతో లెక్కిస్తే 2022 నాటికి ఈ షేర్ల విలువ మరింత పెరుగుతుందని అంచనా. ఆల్ఫాబెట్‌లో ప్రదర్శనాధారిత స్టాక్‌ ప్యాకేజ్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇవి కాకుండా పిచాయ్‌కు మరో 12 కోట్లు, 3 కోట్ల డాలర్ల స్టాక్‌ ప్యాకేజీలు అందిస్తామని, ఆయన ఉద్యోగంలో కొనసాగడాన్ని బట్టి వచ్చే మూడేళ్లలో ఈ ప్యాకేజీలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. డిసెంబర్‌లో ఆల్ఫాబెట్‌ వ్యవస్థాపకులు తమ తదనంతరం కంపెనీని నడిపించే బాధ్యతలను సుందర్‌పిచాయ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుందర్‌పిచాయ్‌ 2004లో గూగుల్‌లో  చేరారు.  2015లో గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఆల్ఫాబెట్‌ బోర్డులో 2017లో చేరారు.  చెన్నైలో పుట్టిన సుందర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేశారు. 
మరికొన్ని విశేషాలు...
- 2016లో ఆయన 20 కోట్ల డాలర్ల విలువైన స్టాక్‌ అవార్డులను గెలుచుకున్నారు. 
- గతేడాది సైతం ప్యాకేజీ ఆఫర్‌ చేయగా ఆయన తిరస్కరించారు. తనకు ఇప్పటికే చాలా ఎక్కువగా చెల్లించారన్నారు.  
- 2018లో ఆయన 19 లక్షల డాలర్ల వార్షిక వేతనం పొందారు. అంతకుముందు ఆయన వార్షిక వేతనం 6.5 లక్షల డాలర్లు.
- ఈ ఏడాది స్టాఫ్‌ మీటింగ్‌లో పిచాయ్‌కు అంతంత ప్యాకేజీలు ఇవ్వడాన్ని కొందరు ఉద్యోగులు ప్రశ్నించినట్లు తెలిసింది. 
- 2014నుంచి ఆయన మొత్తం దాదాపు 55 కోట్ల డాలర్ల ప్యాకేజీలు పొందారని సమాచారం. 
- ప్రస్తుతం పిచాయ్‌ మొత్తం ఆస్తుల విలువ దాదాపు వంద కోట్ల డాలర్లుంటుందని అంచనా!



You may be interested

త్వరలో ఐపీఓకు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

Saturday 21st December 2019

సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ రూ.3వేల కోట్ల సమీకరణకు యోచన నిధుల సమీకరణలో భాగంగా మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌ యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీవోకు వచ్చేందు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ ప్రాతిపాధిక సంస్థ సెబీకి సమర్పించింది. దేశంలో అతిప్రాచీన, ఏడో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండింగ్‌ హౌస్‌ పేరోందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా 3.9 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ.3వేల కోట్ల సమీకరణకు సిద్ధమైంది.  ఐపీఓలో భాగంగా

స్వల్పకాలానికి అప్రమత్తత!

Saturday 21st December 2019

నిఫ్టీపై జిమిత్‌ మోదీ అంచనా ఈ వారం నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు నూతన గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ బలంగా ఉండడం కలిసివచ్చింది. వాల్యూషన్లు అధికంగా ఉండడం, నెగిటవ్‌ వడ్డీరేట్లు, ట్రంప్‌ అభిశంసన, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉండడం... లాంటి నెగిటివ్‌ వార్తలున్నా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించాయి. దేశీయంగా డీఐఐలు మార్కెట్లో కొనుగోళ్లకు విముఖత చూపుతున్నా, ఎఫ్‌ఐఐలు మాత్రం ఉధృతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీనివల్లే మార్కెట్లు అప్‌మూవ్‌ కొనసాగిస్తున్నాయి. ఇలాంటి

Most from this category