News


90 నిముషాల్లో ఫోన్‌ డెలివరీ

Tuesday 24th December 2019
news_main1577159017.png-30392

  • ఆన్‌లైన్‌లోకి ‘బిగ్‌ సి’ మొబైల్స్‌
  • స్మార్ట్‌ ఉపకరణాలూ విక్రయం
  • కంపెనీ ఫౌండర్‌ బాలు చౌదరి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ ఆన్‌లైన్‌ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్‌, యాప్‌ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిముషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్‌ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్‌లెట్లు ఉన్నాయి. కర్నాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్‌, బాలాజీ రెడ్డి, కైలాష్‌ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నూతన ఔట్‌లెట్లు 1,500-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతాయని చెప్పారు.
స్టోర్లలో ఇతర ఉపకరణాలు...
మొబైల్స్‌, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్‌ కంపెనీల స్మార్ట్‌ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్‌ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్‌తో అనుసంధానించే స్మార్ట్‌ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్లను సైతం ఆఫర్‌ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్‌ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్‌ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. You may be interested

ఎయిరిండియా విక్రయంపై జోరుగా కసరత్తు

Tuesday 24th December 2019

సింగపూర్‌, లండన్‌లలో రోడ్‌షోలు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అంతంతమాత్రం స్పందన దేశీ రోడ్‌షోల్లోనే కాస్తంత ఆసక్తి జనవరిలో ఈవోఐ ప్రకటించే అవకాశాలు న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల ఆసక్తిని అంచనా వేసేందుకు ఇటీవలే సింగపూర్‌, లండన్‌లో రోడ్‌షోలు నిర్వహించింది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ,

మొబైల్స్ దే మెజారిటీ వాటా

Tuesday 24th December 2019

ఆన్‌లైన్‌ షాపింగ్‌పై నీల్సన్‌ సర్వే తొలిసారి కస్టమర్లు 56 శాతం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్‌లైన్‌ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే-జూలైతో పోలిస్తే ఆగస్టు-అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్‌ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్‌లైన్‌ కస్టమర్ల షాపింగ్‌

Most from this category