News


ఫార్మా ఎగుమతులు రెండంకెల వృద్ధి

Wednesday 8th January 2020
news_main1578455063.png-30747

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత తయారీ రంగం వృద్ధి 6.2 శాతం నుంచి 2 శాతానికి పడిపోనుందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ వెల్లడించింది. వ్యవసాయం, నిర్మాణం, విద్యుత్‌, సహజవాయువు వంటి రంగాల వృద్ధికి స్పీడ్‌ బ్రేకర్స్‌ పడనున్నాయని తెలిపింది. అయితే ఫార్మా రంగం మాత్రం పరుగు పెడుతోంది. రెండంకెల వృద్ధితో ఆశాజనకంగా ఉంది. భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు 2019 నవంబరులో రూ.12,530 కోట్లు నమోదు చేశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20.60 శాతం అధికం. జూన్‌ తర్వాత అత్యధిక ఎగుమతులు నమోదు చేసింది నవంబరులోనే. జూన్‌లో రూ.12,810 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్స్‌ జరిగాయి. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరులో భారత్‌ నుంచి విదేశాలకు సరఫరా అయిన ఔషధాలు రూ.95,848 కోట్లుగా ఉన్నాయి. 2018-19 ఏప్రిల్‌-నవంబరుతో పోలిస్తే ఇది 11.46 శాతం ఎక్కువ. చాలా రంగాలు తిరోగమన వృద్ధిలో ఉంటే ఫార్మా రంగం వృద్ధి బాటన ఉండడం శుభపరిణామమని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 2019-20లో భారత ఫార్మా ఎగుమతులు 14.5 శాతం అధికమై రూ.1,54,000 కోట్లు నమోదవుతాయని ఫార్మెక్సిల్‌ అంచనా వేస్తోంది. 



You may be interested

ఎయిర్‌ ఇండియా వాటా విక్రయ ఒప్పందానికి ఆమోదం

Wednesday 8th January 2020

ఈఓఐలకు కూడా ఆమోదం తెలిపిన జీఓఎమ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సం‍స్థ, ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. ఎయిర్‌ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి అసక్తి గల సంస్థల నుంచి  ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్‌(మంత్రుల సంఘం-గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పచ్చజెండా ఊపింది. అంతే కాకుండా వాటా కొనుగోలు ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. హోమ్‌ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన గల

చమురు చిక్కులకు.. డాలర్లతో చెక్‌!

Wednesday 8th January 2020

ప్రస్తుతం ఫారెక్స్‌ నిల్వలు 457.5 బిలియన్‌ డాలర్లు 2019లో ఒకే ఏడాది 64 బిలియన్‌ డాలర్ల పెరుగుదల ప్రస్తుత నిధులతో 10 నెలల దిగుమతి అవసరాలు ఓకే అంతర్జాతీయ అనిశ్చితికి డాలర్ల రక్షణ ఆసియాలో అధికంగా డాలర్లను కొన్నది ఆర్‌బీఐనే డాలర్ల సమీకరణలో భారత్‌ తర్వాత కొరియా, తైవాన్‌ చమురు నిల్వల ప్రధాన కేంద్రం పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్‌ ప్రతీకార చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ధరలతో చూస్తే బ్యారెల్‌కు 5

Most from this category