News


పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనానికి బ్రేక్‌

Friday 31st January 2020
news_main1580445361.png-31362

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థలైన ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ప్రతిపాదిత విలీనానికి బ్రేక్‌ పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు అడ్డంకి కావడంతో విలీనం ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టేనని సమాచారం. ఏదేని ప్రాజెక్టులో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ రుణం 25 శాతానికి మించొద్దు. కొన్ని ప్రాజెక్టులకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే రుణం మంజూరు చేసి ఉన్నాయి. ఇరు సంస్థలు విలీనమైతే ఈ రుణ పరిమితి 25 శాతం మించినట్టవుతుంది. విలీనం తర్వాత ఒక ప్రాజెక్టులో ఇరు సంస్థలిచ్చిన మొత్తం రుణం 25 శాతానికి కుదించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు. విలీనం జరుగుతుందన్న ఆలోచనతో ఆర్‌ఈసీలో మెజారిటీ వాటాను 2019 మార్చిలో పీఎఫ్‌సీ రూ.14,500 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి దక్కించుకుంది. ‘ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాం. విలీన ప్రక్రియ ప్రభుత్వమే చూసుకోవాలి’ అని పీఎఫ్‌సీ చైర్మన్‌ రాజీవ్‌ శర్మ వ్యాఖ్యానించారు.



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Friday 31st January 2020

రూ.40,500 పైన పసిడి కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ షేర్‌ మార్కెట్‌లు పతనమవుతున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వేగంగా విస్తరించడం, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అంతేకాకుండా చైనా సమర్థవంతంగా వైరస్‌ను కట్టడి చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ గురువారం రాత్రి విశ్వాసం వ్యక్తం చేయడంతో...బంగారం

సగానికి పడిపోయిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

Friday 31st January 2020

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం సగానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 కన్సాలిడేషన్‌ ఫలితాల్లో రూ.11 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. గత ఆర్థికం ఇదే కాలంలో లాభం రూ.20 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం గతేడాది క్యూ3లో రూ.674 కోట్ల నుంచి ఈ క్యూ3 నాటికి రూ.727 కోట్లకు పెరిగింది. ఎబిటా రూ.34.12 కోట్లుగా ఉంది. పర్యావరణ సవాళ్లు ఉన్నప్పటికీ

Most from this category