News


వంట నూనెను బయోడీజిల్‌గా మార్చే పథకం ఆరంభం

Monday 12th August 2019
news_main1565590033.png-27706

న్యూఢిల్లీ: వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే పథకాన్ని ప్రభుత్వరంగ  ఇండియన్‌ ఆయిల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్‌ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అధికారికంగా ప్రారంభించిన ఈ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆహ్వానించనున్నాయి. ప్రారంభ సంవత్సరంలో లీటర్‌ను రూ.51కు కొనుగోలు చేస్తారు. రెండో సంవత్సరంలో లీటర్‌కు రూ.52.7, మూడో సంవత్సరంలో రూ.54.5కు ధరను పెంచుతారు. 



You may be interested

కాంట్రాక్టు తయారీలో 100% ఎఫ్‌డీఐలు

Monday 12th August 2019

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం ప్రతిపాదన న్యూఢిల్లీ: కాంట్రాక్ట్ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తయారీ రంగంలో  ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. భారత్‌లో తయారైన ఉత్పత్తులను హోల్‌సేల్‌, రిటైల్ మార్గాల్లో ప్రభుత్వ అనుమతుల అవసరం లేకుండా

ఆర్‌ఐఎల్‌ జేవీలో సౌదీ ఆరామ్‌కో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

Monday 12th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐల్‌) ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఆయిల్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌ విభజించి ఏర్పాటుచేసే జాయింట్‌వెంచర్‌ విలువను రూ. 5.32 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో సౌదీ ఆరామ్‌కో 20 శాతం వాటా కొనుగోలుకు రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు ఒప్పందంపై అరామ్‌కోతో సంతకాలు చేయనున్నట్లు సోమవారం జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సర్వసభ్య సమావేశం

Most from this category