News


తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు

Saturday 25th January 2020
news_main1579933444.png-31197

 భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు
న్యూఢిల్లీ: శనివారం ఒక్కసారిగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు భారీగా తగ్గాయి. చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌ రూ.27 పైసలు, డీజిల్‌ రూ.30 పైసలు తగ్గింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.16 గా ఉంటే ఆర్థిక రాజధాని ముంబైలో రూ.79.76, కోల్‌కతాలో రూ.76.77, చెన్నైలో రూ.77.03 గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాలో ప్రధాన పట్టణాలైన హైదరాబాద్‌లో రూ.28 పైసలు తగ్గి లీటరు పెట్రోల్‌ 78.86 ఉంటే, డీజిల్‌ రూ.33 పైసలు తగ్గి లీటరు డీజిల్‌ ధర రూ.73.39గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోల్‌ ధర రూ.28 పైసలు తగ్గుదలతో 78.07గా ఉంది. రూ.31 పైసలు తగ్గుదలతో లీటరు డీజీల్‌ ధర రూ.72.39 గా ఉంది. 
 



You may be interested

క్యూ4లో సిమెంట్‌ కౌంటర్లకు డిమాండ్‌!

Saturday 25th January 2020

మిడ్‌, స్మాల్‌ కం‍పెనీలపై క్యూ3 ఎఫెక్ట్‌? ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, చోళమండలం భేష్‌ - సర్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ వేగమందుకుంది. ఇప్పటివరకూ పలు లార్జ్‌ క్యాప్‌ కంపెనీల పనితీరు వెల్లడైంది. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇటీవల ఈ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫలితాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు సర్థీ

కోల్‌ ఇండియా కొత్త ప్రణాళికలతో సిద్ధం

Saturday 25th January 2020

కొన్నేళ్లగా అనేక సవాళ్లను ఎదుర్కోన్న కోల్‌ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కిందటేడాది దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం, నవంబర్‌లో సంభవించిన అకాల వర్షాలతో బొగ్గు ఉత్పత్తి, సరఫరాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కోల్‌ ఇండియా ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయింది. గతేడాదిలో ఇండియా బొగ్గు వినియోగం 5.83శాతం క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  కోల్‌ ఇండియా దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారకు అయినప్పటికీ అనేక

Most from this category