STOCKS

News


నిరాశావాదంలో కార్పొరేట్‌ దిగ్గజాలు!...పీడబ్ల్యూసీ సర్వే

Tuesday 21st January 2020
news_main1579600737.png-31074

-రికార్డు స్థాయిలో ఉన్నారన్న పీడబ్ల్యూసీ సర్వే 

దావోస్‌: మేధావులైనా, అపర కుబేరులైనా సరే సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మానసిక ఆందోళన ఎదుర్కోక తప్పదు. ఇదే విషయం తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల సీఈవోలలో  నిరాశావాదం రికార్డు స్థాయిలో ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది.  గ్లోబల్‌ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ ప్రపంచ వ్యాప్తంగా 83 ప్రాంతాల్లో 1600 మంది సీఈవోలపై సర్వే నిర్వహించింది. పీడబ్ల్యూసీ తన నివేదికను దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం  వార్షిక సమావేశాల్లో తొలి రోజున విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోల జాబితాలో సగానిపైగా సీఈవోలు వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యల ఒత్తిడికి లోనై నిరాశా నిస్పృహలకు తీవ్రంగా లోనై.. ఎక్కువమంది కార్పొరేట్‌  దిగ్గజాలు నిరాశావాదంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీని ప్రభావంతో  గ్లోబల్‌ జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదని పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం(2018) కూడా ఇదే రికార్డు స్థాయి నిరాశా వాదం ఉందని పేర్కొంది.  తాజా సర్వేలో 27 శాతం మంది సీఈవోలు 2020లో తమ ఆదాయ వృద్ధికి అవకాశాలు ఉన్నా‍యని గట్టిగా నమ్ముతుంటే, 53 శాతం మంది మాత్రం నిరాశావాదంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి దిగజారిపోతుందని అపనమ్మకంతో ఉన్నారని నివేదిక తెలిపింది. ఇక 2020లో గ్లోబల్‌ ఎకానమీ వృద్ధి చెందుతుందని ఆశావాహ దృక్పథంతో ఉన్న సీఈవోలలో ఎక్కువ మంది చైనాకు చెందిన వారు ఉన్నారని నివేదిక వివరించింది.



You may be interested

బడ్జెట్‌ నేపథ్యంలో 15 బెస్ట్‌ స్టాక్స్‌!

Tuesday 21st January 2020

వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధికి ఊతమివ్వగల చర్యలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతానికిలోపు కట్టడి చేయడం సమస్యాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం 2024కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీను అందుకునేందుకు వీలుగా ప్రణాళికలు ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల అటు ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక పురోగతికి వీలుగా పలు చర్యలను తీసుకున్న విషయం విదితమే. ఆర్థిక

ఎస్‌బీఐ హోం బయ్యర్‌ గ్యారెంటీ స్కీమ్‌

Tuesday 21st January 2020

గృహరుణాల్లో ఎస్‌బీఐ ఆర్‌బీబీజీ స్కీమ్‌! ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహరుణాలు పొందే కస్టమర్లకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే  రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ స్కీమ్‌) స్కీమ్‌. ఈస్కీమ్‌తో ఎస్‌బీఐ వద్ద గృహరుణాలు తీసుకునే కస్టమర్లకు ప్రాజెక్ట్‌ గ్యారెంటీని అందిస్తుంది.అంటే  ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ లో ఇల్లు కొనుక్కోవడానికి ఎస్‌బీఐలో లోను తీసుకుంటే ఆ ప్రాజెక్ట్‌ మధ్యలో ఆగిపోకుండా పూర్తి

Most from this category