News


రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్‌’ వ్యాపారం

Friday 20th December 2019
news_main1576812086.png-30320

  • బెంగళూరులో ఘనంగా 14వ వార్షికోత్సవం

సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మాధవన్‌ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రతించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్‌ పరుపులు కొన్నారని తెలియజేశారు. రూ.4 కోట్లతో వ్యాపారం ప్రారంభించగా.. 14 ఏళ్లలో రూ.500 కోట్లకు చేరామని చెప్పారాయన. ‘‘కొత్త పరుపు కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పరుపు ఎత్తు కీలకం. నేలమట్టం నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండటం శ్రేయస్కరం’’ అని వివరించారు. పరుపులు పాతబడిన వెంటనే మార్చుకోవాలని.. పదేళ్లకు మించి వినియోగించరాదని సూచించారు. భారతదేశంలో కోల్‌కతా, కోయబంత్తూరు, ఢిల్లీ, పుణెలో ఉత్పత్తి కేంద్రాలున్నాయని తెలియజేశారు. 
గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యం 
పెప్స్‌ పరుపులను పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ జేఎండీ జి.శంకర్‌రామ్‌ చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పెప్స్‌ శాఖలు ప్రాచుర్యం పొందాయని, ఏపీలో కోస్తా ప్రాంతంలో వ్యాపారం బాగుందని చెప్పారు. రాయలసీమలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం విదేశీ మెటీరియల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. పెప్స్‌ పరుపులకు మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారాయన. You may be interested

ఎక్కువ వేతనాలు బెంగళూరులో

Friday 20th December 2019

ఎక్కువగా పారితోషికం ఐటీ రంగంలో వేతన ధోరణులపై రాండ్‌స్టాడ్‌ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్‌ ‘ఇన్‌సైట్స్‌ శాలరీ ట్రెండ్స్‌ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్‌ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్‌ లెవల్‌

టెలికం.. లైన్‌ కట్‌ అవుతోంది..

Friday 20th December 2019

ట్రాయ్‌ తక్షణం జోక్యం చేసుకోవాలి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యలు ఏఆర్‌పీయూ రూ.300కు చేరవచ్చని అంచనా న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు

Most from this category