News


పీసీ జ్యుయలర్‌ నష్టాలు రూ.377 కోట్లు

Saturday 1st June 2019
news_main1559364018.png-26030

  • ఎగుమతి వ్యాపారంలో నష్టాలు 

న్యూఢిల్లీ: పీసీ జ్యుయలర్‌ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.377 కోట్ల నికర నష్టాలు(స్డాండ్‌అలోన్‌) వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.118 కోట్ల నికర లాభం వచ్చిందని పీసీ జ్యుయలర్‌ తెలిపింది. ఎగుమతి వ్యాపారంలో నష్టాలు రావడం కారణంగా గత క్యూ4లో నష్టాలు తప్పలేదని వివరించింది. దేశీయ వ్యాపారంలో లాభాలు కొనసాగాయని, అయితే మార్జిన్లు స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,115 కోట్ల నుంచి రూ.2,204 కోట్లకు పెరిగిందని తెలిపింది. 
ఏడాది నష్టాలు రూ.3 కోట్లు...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.567 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.9,589 కోట్ల నుంచి రూ.8,461 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 17 శాతంగా ఉందని పేర్కొంది. ఇక కన్సాలిడేడెట్‌ పరంగా చూస్తే, 2017-18లో  రూ.536 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.61 లక్షల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,707 కోట్ల నుంచి రూ.8,764 కోట్లకు తగ్గిందని తెలిపింది. 



You may be interested

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ లాభం రూ.1,389 కోట్లు

Saturday 1st June 2019

ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ న్యూఢిల్లీ: ట్రావెల్‌ కంపెనీ, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.1,388 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.53 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,214 కోట్ల నుంచి రూ.1,263 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ పీటర్‌ కేర్కర్‌ చెప్పారు. ప్రతి బిజినెస్‌లో సరైన

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల ధర వెల్లడి

Saturday 1st June 2019

గ్రాముకు రూ.3,196 ముంబై: సౌర్వభౌమ బంగారం బాండ్ల నూతన సిరీస్‌ విక్రయ ధరను ప్రభుత్వం ప్రకటించింది. గ్రాముకు రూ.3,196 చొప్పున నిర్ణయించింది. అయితే, ఆన్‌లైన్‌ ద్వారా  డిజిటల్‌ పేమెంట్‌ చేసే ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్‌ ఇచ్చింది. ఈ తరహా పెట్టుబడిదారులకు గ్రాము రూ.3,146 ఉండనుంది. బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేసే సదుపాయం గల ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను.. ఈఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతినెలా విడుదలచేయనున్నట్లు ప్రకటించింది. 

Most from this category