STOCKS

News


తప్పుడు మెసేజ్‌లతో జాగ్రత్త..పేటీఎం చీఫ్‌

Thursday 21st November 2019
news_main1574333245.png-29765

కంపెనీ అధికారుల్లాగా మోసగాళ్లు పంపే నకిలీ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ కస్టమర్లకు సూచించారు. పేటీఎం అకౌంట్‌ బ్లాక్‌ చేశామని, కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌)ని చేయమని వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని సోషల్‌ మీడియాలో ఆయన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. అలా వచ్చే ఒక శాంపిల్‌ నకిలీ మెసేజ్‌ను సైతం ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ మీ పేటీఎం అకౌంట్‌ను కొంత కాలం హోల్డ్‌లో పెట్టాము. మీరు మీ ఫోన్‌ నెంబర్‌తో సహా కేవైసీ పూర్తి చేయండి.’’ అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో పాటు లక్కీ డ్రాలో గెలుపొందారని కూడా వస్తుంటాయని, అవి నమ్మొద్దని చెప్పారు.

మూడునెలలుగా పలువరు పేటీఎం కస్టమర్లు ఇలాంటి మోసాలపై కంపెనీ సైబర్‌ సెల్‌కు, ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి సాయం చేస్తామని, అందుకోసం ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని మెసేజ్‌లో చెబుతారు. అలా ఎనీడెస్క్‌, క్విక్‌ సపోర్ట్‌, టీమ్‌ వ్యూయర్‌ లాంటి స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌ ద్వారా కస్టమర్‌ మొబైల్‌ లేదా కంప్యూటర్‌లోకి జొరబడతారు. ఇలాంటిమోసాలన్నింటిని ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని, వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ కుమార్‌ గుప్తా చెప్పారు. తమ సైబర్‌ సెల్‌ ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. తామెప్పుడూ కేవైసీని షేరింగ్‌ యాప్స్‌తో లేదా ఫోన్‌ కాల్స్‌తో పూర్తి చేయమని, తమ స్టోర్‌ను సందర్శించడం లేదా తమ ఎగ్జిక్యూటివ్‌ వచ్చి వెరిఫై చేసుకోవడం జరుగుతుందని వివరించారు. జూలై నవంబర్‌ కాలంలో ఇలాంటి మోసాలపై దాదాపు 2000 ఫిర్యాదులు ఆర్‌బీఐకి వచ్చాయని, ఇందులో కేవలం 723 ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల కస్టమర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.  You may be interested

ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.150 వస్తేనే..: సీవోఏఐ

Friday 22nd November 2019

టెలికం కస్టమర్లు తిరిగి పూర్వపు ధరలు చెల్లించే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి ప్రస్తుతం వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.124గా ఉంది. ఇది కనీసం రూ.150కు చేరాల్సిన అవసరం ఉందని, అప్పుడే కంపెనీలు మనుగడ సాగించగలవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.    సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ

స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 21st November 2019

సూచీల రెండురోజుల వరుస లాభాల ముగింపునకు గురువారం బ్రేక్‌ పడింది. ఇంట్రాడే ఆద్యంతం పరిమితి శ్రేణిలో ట్రేడైన సూచీలు చివరి అరగంటలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 40,575 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లను కోల్పోయి 11,968 వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం అంశంపై సరైన స్పష్టత కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3 పాయింట్ల నష్టంతో 31,350

Most from this category