News


రెండేళ్లలో పేటీఎం ఐపీఓ!

Saturday 7th September 2019
news_main1567831049.png-28250

- స్టార్టప్‌లకు ఇది స్వర్ణయుగం
- పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ వెల్లడి

ముంబై: ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సన్నాహాలను మరో రెండేళ్లలో ప్రారంభించనున్నది. తమ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కావడం తప్పనిసరి అని, అయితే ఇంతవరకూ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని పేటీఎమ్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మవివరించారు. స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాకముందే మరింతగా నగదు నిల్వలను ఆర్జించాల్సి ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన హెచ్‌టీ-మింట్‌ ఏషియా లీడర్షిప్‌ సమిట్‌లో పేటీఎమ్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది వారెన్‌ బఫెట్‌ బెర్క్‌షైర్‌ హతావే నుంచి 30 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. పేటీఎమ్‌ విలువ 1,500 కోట్ల డాలర్లకు ఎగసిందని ఇటీవలనే విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు. 
స్టార్టప్‌లకు స్వర్ణయుగం...
ఇప్పుడు భారత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌కు స్వర్ణయుగమని విజయ్‌ శేఖర్‌ పేర్కొన్నారు. ఇలాంటి కాలంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని, చిన్న చిన్న వ్యవస్థాపకులు పెద్ద పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేయగలుగుతున్నారని వివరించారు. చిన్న చిన్న కంపెనీలు, తమ వాటాదారులకు భారీ విలువను చేకూర్చిపెట్టాయని పేర్కొన్నారు. 
ఆర్నెళ్లలో 390 కోట్ల డాలర్లు...
భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోంది. దేశీ, విదేశీ సంస్థలు ఈ స్టార్టప్‌ల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత స్టార్టప్‌లు 390 కోట్ల డాలర్ల నిధులను సమీకరించాయని వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. 2016, 2017 సంవత్సరాల్లో వచ్చిన నిధుల కంటే కూడా ఇది అధికం. You may be interested

మాంద్యం ముదిరితే మరింత ముప్పు !

Saturday 7th September 2019

మరో పది లక్షల ఉద్యోగాలకు ఎసరు  జీఎస్‌టీ తగ్గించాలి మరిన్ని ఉద్దీపన చర్యలు కోరుతున్న వాహన పరిశ్రమ  న్యూఢిల్లీ: వాహన రంగంలో నెలకొన్న ప్రస్తుత మందగమనం ఇలాగే కొనసాగితే, మరిన్ని ఉద్యోగాలు పోతాయని వాహన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మరిన్ని సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా హెచ్చరించారు. అందుకని ప్రభుత్వం తక్షణం జీఎస్‌టీ తగ్గింపు వంటి  ఉద్దీపన చర్యలు ప్రకటించాలని ఆయన అభ్యర్థించారు.  భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలు

అమ్మకానికి ఐవీఆర్‌సీఎల్‌

Saturday 7th September 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎడాపెడా అప్పులు చేసి... ఆనక తీర్చలేక దివాలా తీసిన మౌలిక రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌... అమ్మకానికి వచ్చింది. దీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయొచ్చంటూ కంపెనీ లిక్విడేటర్‌ సుతాను సిన్హా కోరారు. దీనికి రిజర్వు ధరను రూ.1,654.47 కోట్లుగా నిర్ణయించారు. అక్టోబరు 4న ఎలక్ట్రానిక్‌ వేలం ఉంటుందని లిక్విడేటర్‌గా కూడా వ్యవహరిస్తున్న దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) తెలియజేశారు. దివాలాతీసిన ఐవీఆర్‌సీఎల్‌ను గట్టెక్కించేందుకు సరైన

Most from this category