News


వ్యాపారుల కోసం పేటీఎం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్

Thursday 9th January 2020
Markets_main1578542578.png-30786

ముంబై: డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థ పేటీఎం తాజాగా దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వాలెట్‌, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే డిజిటల్ లెడ్జర్‌ 'బిజినెస్ ఖాతా' సర్వీసును కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. 



You may be interested

జియో నుంచి వై-ఫై కాలింగ్‌ సేవలు

Thursday 9th January 2020

న్యూఢిల్లీ: వై-ఫై ద్వారా కూడా వాయిస్‌, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-ఫైకి మారవచ్చని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో

ఎస్‌బీఐ విన్నూత గృహరుణ పథకం

Thursday 9th January 2020

ఎస్‌బీఐ ప్రకటన ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్‌బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5

Most from this category