News


మహిళా సీఈఓల వేతనాలు తక్కువ!

Saturday 8th February 2020
news_main1581150360.png-31627

 

 మహిళలు కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగినప్పటికీ స్త్రీ పురుషుల వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. పురుష సీఈఓల సగటు జీతాల కంటే మహిళా సీఈఓల సగటు జీతాలు 45 శాతం తక్కువగా ఉన్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. గత ఆర్థికసంవత్సరం 2018లో  22.5 శాతంగా ఉన్న పే గ్యాప్‌ రెట్టింపు అయ్యి 45 శాతానికి చేరిందని ప్రైమ్‌ డేటాబేస్‌ నంబర్స్‌ నివేదిక వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయిన  1,747 కంపెనీల వార్షిక నివేదికను ఎన్‌ఎస్‌ఈఇన్ఫోబేస్‌ డాట్‌కమ్‌లోని డేటాతో ప్రైమ్‌డేటాబేస్‌ పోల్చిచూసినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం... గత ఆర్థికసంవత్సరలో స్త్రీ,పురుషుల మధ్య‘పే గ్యాప్‌’ రెంట్టింపు అయ్యి, పురుష సీఈఓల జీతాలు 8శాతం పెరగడంతో మహిళా సీఈఓల సగటు జీతాలు తగ్గాయి. మహిళల్లో పని అనుభవం  ఉన్నప్పటికీ జీతభత్యాల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించడంతో.. మహిళల కెరియర్‌ అబివృద్ధికి అడ్డంకులు ఏవిధంగా ఉన్నాయో ఈ నివేదిక చెబుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

90 శాతం మంది పురుష సీఈఓలే
కార్పొరేట్‌ సెక్టార్‌లో  మహిళలు ఎదగాలంటే మధ్య నిర్వహణ స్థాయి ఉద్యోగుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మహిళల ఎదుగుదలను తట్టుకోలేక వారికి వ్యతిరేకంగా ప్రవరిస్తుంటారు. దీంతో వారు మానసిక దైర్యాన్ని కోల్పోయి వెనకబడడం కూడా పే గ్యాప్‌ ఒక కారణం. ఉద్యోగుల్ని నియమించే ఉతన్నతాధికారుల స్థానంలో కూడా పురుషులే ఉండడం వల్ల ..ఎక్కువమంది పురుషులనే ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయి. సెలక్షన్‌ ప్రాసెస్‌లో కూడా పురుష ఉద్యోగులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడే మహిళలలకు పురుషులకు చెల్లించే వేతనాల్లో భారీవ్యత్యాసాలకు బీజం పడుతుంది. ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌(పీఆండ్‌ఎల్‌) రోల్స్‌లో ఎక్కువమంది మహిళలను ప్రోత్సహిస్తే వేతన హెచ్చుతగ్గులు తగ్గుతాయి.కానీ ఈ రోల్స్‌ను మహిళలకు ఇచ్చేందుకు ఆయా కంపెనీలు సుమఖంగా ఉండవు. 
                                                                                                  -కిరణ్‌ మజుందార్‌ షా

                                                                                                  బయోకాన్‌ చైర్‌పర్సన్‌.

పే గ్యాప్‌లలో మార్పు రావాల్సి అవసరం ఉంది
  లింగత్వం ఆధారంగా జీత భత్యాలను నిర్ణయించకూడదు. పేగ్యాప్‌లో తప్పనిసరిగా మార్పురావాలి.మహిళల సర్వతోముఖాభివృద్ధిలో తోడ్పడేందుకు మల్టినేషనల్‌ కంపెనీలన్నీ కృషిచేయాలి.
                                                                                            -హర్ష్‌ గోయెంకా

                                                                                        ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌.

సీఈఓల్లో పురుషులే అధికం
 మహిళల కంటే పురుషులే ఎక్కువకాలం సీఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. దీంతో వారి జీతభత్యాలు ఎక్కువగానే ఉంటున్నాయి.
                                                                       -
దేబరత్‌ మిశ్రా 

                                                           డెలాయిట్‌ ఇండియా లీడర్‌షిప్‌ నిపుణులు.

నైపుణ్యం లేకపోవడం, సమాజంలో వివక్ష
 మానవ సమాజం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా మహిళలను తక్కువగా చూడడం, వీళ్లకేం తెలుసు, వీళ్లకేం వచ్చు అనే అభిప్రాయాలు ఉండడం వల్ల పేగ్యాప్‌ పెరుగుతుంది. భిన్న వర్గాల నుంచి వచ్చే మహిళలు తమ సామాజిక, ఆర్థిక పరిస్థితులు పే గ్యాప్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఉమెన్‌ వర్క్‌ఫోర్స్‌పై మా అవతార్‌ అధ్యయనం ప్రకారం..  9 శాతం మంది మహిళలకు మాత్రమే పనిచేసే కార్యాలయాల్లో ప్రోత్సహించే వాతావరణం ఉంది. తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు పురుషులు సమయాన్ని, డబ్బుని కేటాయిస్తుంటే స్త్రీలు మాత్రం తమ కుటుంబాభివృద్ధికే అధిక సమయాన్ని, ధనాన్ని కేటాయిస్తున్నారు. 
                 
                                                               -సౌందర్య రాజేష్‌

                                                                           అవతార్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు

విశ్లేషకులు మాట్లాడుతూ
పే గ్యాప్‌ ఉండడానికి మహిళలకు ఉన్న బాధ్యతలేనని అభిప్రయాపడ్డారు. ముఖ్యంగా పెళ్లైన ఒక అమ్మాయి తన కెరియర్‌లో పెద్ద అడ్డంకిగా మారేది మెటర్నీటీ సమయం. ఈ సమయంలో తన ఉద్యోగానికి కొంత సమయం దూరమవతారు. అప్పుడు వారు సర్వీస్‌లోనూ, ఆర్థికంగాను వెనక పడిపోతారు. ఇది కూడా పే గ్యాప్‌కు ఒక కారణ మని నిపుణుల చెబుతున్నారు. డెలివరీ తరువాత పిల్లల పెంపకం వారి బాగోగులను చూసుకోవడానకి కనీసం 4-6 ఏళ్ల సమయాన్ని కేటాయిస్తారు. కొన్నిసార్లు ఇటు ఉద్యోగం అటు పిల్లల్ని చూసుకుంటున్నప్పటికీ ఒత్తిడి పెరిగి తమ ఉద్యోగంలో తమదైన ముద్ర వేయలేక వెనకపడిపోతుంటారు. మహిళలతో పోలిస్తే ఇటువంటి బాధ్యతలేవి లేని పురుష ఉద్యోగులు వేగంగా ఉన్నత స్థాయి పదవులను అలంకరించి మహిళలల కంటే ఎక్కు వేతనాలు పొందుతారు.స్త్రీ పురుషులు సమానమని, అన్నింటిల్లో వారికి సరైన ప్రోత్సాహకాలు అందితే మహిళా సీఈఓల సంఖ్య కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

ఏయూ స్మాల్‌ బ్యాంక్‌.. ర్యాలీ ఎందుకంట?

Saturday 8th February 2020

3 నెలల్లో 70 శాతం ర్యాలీ రూ. 637 నుం‍చి రూ. 1129కు  క్యూ3లో పటిష్ట ఫలితాలు ఇష్యూ ధర రూ. 358 కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇటీవల మరింత జోరందుకుంది. ఇందుకు కంపెనీ పటిష్ట పనితీరును చూపడం ప్రధానంగా కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-

ఈ ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఆకర్షణీయం

Saturday 8th February 2020

జాబితాలో డీమార్ట్‌, టాటా గ్లోబల్‌ డాబర్‌ ఇండియా, బాటా ఇండియా జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ గత వారాంతాన విడుదలైన కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజుల్లో రికవరీ సాధించాయని రితేష్‌ ఆషెర్‌, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌, కిఫ్స్‌ ట్రేడ్‌ కేపిటల్‌ పేర్కొన్నారు. ఇకపై మార్కెట్ల ట్రెండ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలతోపాటు.. ఎఫ్‌ంఎసీజీ రంగంపై బడ్జెట్‌ సానుకూల ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఇంకా పలు ఇతర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో రితేష్‌ వ్యక్తం

Most from this category