News


పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా

Thursday 19th December 2019
news_main1576730660.png-30308

  • పూర్తయిన లావాదేవీ

న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్‌ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్‌.కె. తిజరీవాలా పేర్కొన్నారు. 



You may be interested

టెక్‌ స్టార్టప్‌లలో భారీ నియామకాలు

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్‌ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్‌వేర్‌ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్‌ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 

టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది

Thursday 19th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్‌ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్‌ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్‌ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్‌ గ్రూప్‌ సీఎండీ గీతాంబర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్‌ వినియోగంతో మార్కెటింగ్‌

Most from this category