News


జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు డౌన్‌

Tuesday 20th August 2019
news_main1566278468.png-27886

  • 11 శాతం తగ్గిన రిటైల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్‌ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ హర్షరాజ్‌ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగానే ఉన్నందున డిమాండ్‌ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25-30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55-60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు.



You may be interested

తగ్గిన చమురు ధరలు

Tuesday 20th August 2019

ముడి చమురు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కానీ యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో ఈ నష్టాలు పరిమితంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ మంగళవారం 0.05 శాతం తగ్గి బ్యారెల్‌ 59.71 డాలర్లకు చేరుకుంది. కాగా గత సెషన్లో బ్రెంట్‌ క్రూడ్‌ 1.88 శాతం పెరిగింది. అదే విధంగా గత సెషన్లో 2.44 శాతం లాభపడిన డబ్యూటీఐ క్రూడ్‌ మంగళవారం 0.3 శాతం తగ్గి

ఇన్‌ఫ్రా రంగానికి ప్రత్యేక ఫండ్‌

Tuesday 20th August 2019

పరిశీలిస్తున్న కేంద్రం  న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్‌, విద్యుత్‌ సహా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ విభాగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర గృహ, పట్టణాల వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. ఇన్‌ఫ్రా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రతింపులు జరిపినట్లు ఆయన వివరించారు. వీరిలో

Most from this category