News


వాహన అమ్మకాలు తగ్గాయ్‌...

Monday 3rd June 2019
news_main1559542664.png-26057

న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మేనెల్లో కూడా అమ్మకాలు నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి తగ్గిపోయాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్‌ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటో అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్‌ నెంబర్‌, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గతనెల్లో సేల్స్‌ భారీగానే తగ్గాయి’ అని వివరించారు. 

  • వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలిపరిశ్రమ డిమాండ్‌
     

వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం వాహనాలపై  28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్‌ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్‌ కోరింది. 



You may be interested

ఆర్‌బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచీ..!

Monday 3rd June 2019

గురువారం ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పతనంకావడంపై ఆందోళనలు భారీగా తగ్గిన ముడిచమురు ధరలతో కొంత ఉపశమనం ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు

వైద్య బీమా పాలసీ... అంతేనా?

Monday 3rd June 2019

ప్రతీ ఇద్దరిలో ఒకరు సంతోషంగా లేని పరిస్థితి పాలసీలోని ఫీచర్ల పట్ల అసంతృప్తి పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువ క్లెయిమ్‌ల విషయంలోనూ అభ్యంతరాలు సర్వేలో వెల్లడైన ఆసక్తికర అంశాలు వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం

Most from this category