News


జనవరిలో తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Friday 21st February 2020
news_main1582257979.png-31977

  • రిజిస్ట్రేషన్ల ఆధారంగా వెల్లడించిన ఎఫ్‌ఏడీఏ

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో తగ్గుదలను నమోదుచేసినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. గతనెల్లో 2,90,879 యూనిట్ల విక్రయాలు నమోదుకాగా, అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 3,04,929 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 4.61 శాతం క్షీణత ఉన్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉ‍న్న 1,432 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్‌టీఓ) ఉండగా.. 1,223 ఆర్‌టీఓల్లో నమోదైన వాహన రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఈ డేటాను రూపొందించినట్లు వెల్లడించింది. ద్విచక్ర వాహన విక్రయాలు 8.82 శాతం క్షీణతతో 12,67,366 యూనిట్లుగా నమోదుకాగా, వాణిజ్య వాహనాలు 6.89 శాతం తగ్గుదలతో 82,187 యూనిట్లుగా ఉన్నాయి. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కొత్త వాహనాలను ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఉన్న కారణంగా విక్రయాల్లో తగ్గుదల కొనసాగుతోందని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ ఆశిష్ హర్షరాజ్ కాలే వ్యాఖ్యానించారు. బీఎస్‌-4 నుంచి ఒక్కసారిగా మారాల్సి ఉండడం వల్ల పరిశ్రమలో విక్రయాలు తగ్గాయని అన్నారు. 



You may be interested

పసిడి @ రూ.42,000

Friday 21st February 2020

గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఏడేళ్ల గరిష్టానికి చేరిన బంగారం ధర శుక్రవారం మరోసారి భారీగా పెరిగి, కొత్త రికార్డును నెలకొల్పింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బుధవారం ముగింపుతో పోలిస్తే గురువారం రాత్రి రూ.500 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 42,039.00 వద్ద ట్రేడ్‌ ముగిసింది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం. కాగా దేశీయ ఎంసీఎక్స్‌కు ఈరోజు ఉదయం సెలవు. సాయంత్రం మార్కెట్‌ ఓపెన్‌

నేడు మార్కెట్‌కు సెలవు

Friday 21st February 2020

మహాశివరాత్రి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు మాత్రం సాయంత్రం పనిచేస్తాయి. రేపు, ఎల్లుండి శని, ఆదివారాలు కాబట్టి సాదారణ సెలవులు. మార్కెట్‌ తిరిగి సోమవారం ప్రారంభవుతోంది.  ఇక నిన్న రోజు ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 153 పాయింట్లు పతనమై 41,170 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,081 పాయింట్ల

Most from this category