News


జనవరి 15లోగా తేల్చండి

Saturday 21st December 2019
news_main1576899676.png-30345

  • 'కార్వీ-యాక్సిస్‌ బ్యాంక్‌' షేర్ల వివాదంపై 
  • సెబీకి శాట్ ఆదేశాలు

న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటీషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలంటూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్‌) పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. కార్వీ తనఖా పెట్టిన షేర్లపై యాక్సిస్ బ్యాంక్ రూ. 81 కోట్లు రుణమిచ్చింది. ఆ షేర్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా.. కార్వీ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ నియంత్రణ సంస్థలను యాక్సిస్‌ బ్యాంక్ కోరుతోంది. 



You may be interested

టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి

Saturday 21st December 2019

లైసెన్స్‌, స్పెక్ట్రమ్‌ చార్జీలు తగ్గించాలి సీవోఏఐ వినతి న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 2020-21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్‌

పన్ను ఎగవేతదారులను పట్టుకోండి

Saturday 21st December 2019

లక్ష్యాన్ని చేరుకోండి అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశం న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్‌ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌

Most from this category