News


పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌ నష్టాలు రూ.21 కోట్లు

Saturday 17th November 2018
news_main1542432806.png-22126

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.21 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.33 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.23 కోట్ల నుంచి రూ.24 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ ప్రదీప్‌ జైన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారాయన. ‘‘కాంట్రాక్టు పద్ధతిన పూర్తిచేసిన ఐదింటితో కలిపి ఇప్పటివరకూ 65 ​‍ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. 32.01 మిలియన్‌ చదరపుటడుగుల స్థలాన్ని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం 51.51 మిలియన్‌ చదరపుటడుగుల స్పేస్‌ను డెవలప్‌ చేస్తున్నాం’’ అని వివరించారు.



You may be interested

ఇంకా ఎలాంటి ఆఫర్‌ చేయలేదు..

Saturday 17th November 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్‌పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా

బెంజ్‌ నుంచి నూతన సీఎల్‌ఎస్‌ 300డి

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సెడెస్‌ బెంజ్‌ నూతనంగా సీఎల్‌ఎస్‌ 300డి మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.84.70 లక్షలు. కొత్త తరం ఈ సీఎల్‌ఎస్‌ మోడల్‌ కారు రెండు లీటర్ల బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన డీజిల్‌ ఇంజన్‌తో, 180కేవీ పవర్‌తో ఉంటుందని కంపెనీ తెలిపింది. తాజా విడుదల 2018లో కంపెనీ నుంచి 12వ ఉత్పత్తి అని మెర్సెడెస్‌ బెంజ్‌ ఇండియా

Most from this category