News


అనధికార డిపాజిట్‌ పథకాలపై ఉక్కుపాదం

Friday 4th January 2019
news_main1546576449.png-23405

  •  కఠిన చర్యలకు పార్లమెంటరీ కమిటీ సిఫారసు

న్యూఢిల్లీ: అనధికార డిపాజిట్‌ పథకాలు, ఇందుకు కారకులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. అన్‌రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ నిషేధ బిల్లులోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 సభ్యుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు తమ సిఫారసులను పార్లమెంటుకు సమర్పించింది. అమాయకులైన ఇన్వెస్టర్లు మోసపూరిత డిపాజిట్‌ స్కీమ్‌లతో మోసపోకుండా తగిన చర్యలు ఉండాలన్నది ఈ సిఫారసుల సారాంశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. తప్పుడు ప్రచారాలు, మోసపూరిత పథకాల నిర్వహణ, సంబంధిత ప్రకటనల జారీసహా ఎటువంటి నియంత్రణలూ లేని డిపాజిట్ల సేకరణను తీవ్ర నేరంగా పరిగణించాలని సూచించిన పార్లమెంటరీ కమిటీ, నాన్‌-బెయిలబుల్‌ నేరాల కింద ఈ మోసాలను పరిగణించాలని పేర్కొంది. ఆయా తప్పుడు పథకాల ద్వారా సమీకరించిన డిపాజిట్ల పునఃచెల్లింపుల వైఫల్యాలపై కూడా కఠిన చర్యలు తప్పవు. గత ఏడాది జూలై 18వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం సమీక్ష, తగిన సిఫారసుల నిమిత్తం ఆగస్టు 10న పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును నివేదించడం జరిగింది. తప్పుడు డిపాజిట్ల నుంచి సామాన్యులను కాపాడడానికి క్షేత్రస్థాయిలోనే తగిన చర్యలు కీలకమని కమిటీ సూచించింది. ఇందుకు తగిన పటిష్ట యంత్రాగం అవసరమని పేర్కొంది.



You may be interested

పసిడి @ 1300 డాలర్లు

Friday 4th January 2019

కొత్త ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర తొలిసారి 1300 డాలర్లను తాకింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5.55డాలర్లు పెరిగి 1,300.35 డాలర్ల గరిష్టాన్ని తాకింది. యెన్‌ మారకంలో డాలర్‌ బలహీనత, ఆర్థిక ఆర్థికాభివృద్ధి మందగమనంతో ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, బాండ్‌ ఈల్డ్‌ పతనం, ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించాయి. ఉదయం గం:10:45ని.లకు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌

త్వరలో మళ్లీ సీఎస్‌సీ ఆధార్‌ సేవలు?

Friday 4th January 2019

- ‘నాన్‌-బయోమెట్రిక్‌’కు పరిమితం - యూఐడీఏఐ కసరత్తు న్యూఢిల్లీ: ఆధార్‌ నమోదు, సమాచారంలో మార్పులు, చేర్పులు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఫైలింగ్‌లో ప్రజలకు సహకరించడం వంటి సేవలకు త్వరలో మళ్లీ కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌సీ)ను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘నాన్‌-బయోమెట్రిక్‌’ (వేలిముద్ర అవసరం లేని)కు మాత్రమే ఈ సేవలు పరిమితమవుతాయని సమాచారం. ఈ మేరకు అనుమతులు జారీపై యూఐడీఏఐ (యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు

Most from this category