News


ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌ కట్‌

Saturday 15th February 2020
news_main1581738348.png-31813

- మార్చి 31 వరకు గడువు న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్) విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం తప్పదని ఇప్పటికే పలు సార్లు సూచించి, గడువు తేదీలను పొడగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. లింక్‌ కాని పాన్‌ కార్డులను పనిచేయకుండా (ఇన్‌ ఆపరేటివ్‌) చేయనున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇందుకు మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139ఏఏ సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం.. 2017 జూలై ఒకటి వరకు జారీ చేసిన పాన్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిని, పేర్కొన్న గడువు తేదీ లోపు లింక్‌ చేయకుంటే ఇన్‌ఆపరేటివ్‌ చేసేందుకు ఇన్‌కం ట్యాక్స్‌ రూల్స్‌లో 114ఏఏఏ చేర్చినట్లు ప్రకటించింది. జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్‌లకు ఆధార్‌ అనుసంధానం జరగ్గా, ఇప్పటికీ 17.58 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ కాలేదని వెల్లడించింది. 



You may be interested

హైదరాబాద్‌లో అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ ‘కోల్డ్‌ స్టోన్‌’

Saturday 15th February 2020

350 కోట్లతో టేబ్లెజ్‌ విస్తరణ ప్రణాళికలు టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ కోల్డ్‌ స్టోన్‌ క్రీమరీ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా ఉన్న లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన రిటైల్‌ విభాగం ‘టేబ్లెజ్‌’ దీన్ని ప్రారంభించింది. శుక్రవారమిక్కడ బంజారాహిల్స్, బేగంపేటలో రెండు ఔట్‌లెట్లను టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ ఏడాది మే ముగిసే నాటికి మరో మూడు స్టోర్లను

సగం తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

Saturday 15th February 2020

చమురు, గ్యాస్‌ ధరలు తగ్గాయ్‌  ఉత్పత్తి కూడా క్షీణించింది  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో సగం తగ్గింది. గత క్యూ3లో రూ.8,263 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో 50 శాతం క్షీణించి రూ.8,263 కోట్లకు తగ్గిందని ఓఎన్‌జీసీ తెలిపింది. చమురు, గ్యాస్‌ ధరలు పతనం కావడం, ఉత్పత్తి కూడా తగ్గడంతో నికర

Most from this category