News


ఆధార్‌కార్డుతో పాన్‌ను ఇంకా లింక్‌ చేయలేదా? అయితే ఇది మీకే!

Saturday 15th February 2020
news_main1581745148.png-31822

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని పలుమార్లు సూచించిన ఆదాయ పన్నుశాఖ తేదీలను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా తుది హెచ్చరికను జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేయాలి. లేదంటే లింక్‌ కాని పాన్‌ కార్డులు పనిచేయవని ఐటీ శాఖ ప్రకటించింది. మరి ఈ రెండింటిని ఎలా లింక్‌ చేయాలో తెలుసుకుందాం..

రెండే నిమిషాల్లో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు.  పాన్‌కార్డును ఆధార్‌ నంబర్‌తో చాలా సులభంగా అనుసంధానం చేయవచ్చు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా లింక్‌ చేసుకోవాలి. 
ఇదివరకే రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లు ఇన్‌కం ట్యాక్స్‌ ఇండియా ఈ ఫైలింగ్‌​ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి ..

  • యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్‌ ఆధార్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇక్కడ అడిగిన వివరాలు అన్ని ఇచ్చి పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోవచ్చు. 

 

కొత్తగా రిజస్టర్‌ చేసుకోవాలంటే

  • ముందుగా ఇన్‌కం ట్యాక్స్‌ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి హోం పేజిలో ఎడమవైపు ఉన్న లింక్‌ ఆధార్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • ఇక్కడ పాన్‌కార్డు నంబర్‌, ఆధార్‌ నంబర్‌, మీ పేరు ఎంటర్‌ చేస్తే పాన్‌ కార్డు ఆధార్‌ నంబర్‌లు అనుసంధానమవుతాయి. లేదంటే వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని ఆ తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా

ఎస్‌ఎంఎస్‌ పంపించి కూడా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. 567678 లేదా 56161 నంబర్‌కి ఎస్‌ఎంఎస్‌ పంపిస్తే లింక్‌ అయిపోతుందని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. మీ ఆధార్‌ నంబర్‌ 2072364923 అని, పాన్‌ నంబర్‌ ​HYR9865J అని అనుకోండి. అప్పుడు UIDPAN 2072364923 HYR 9865J అని టైప్‌ చేసి 567678 లేదా 56161 నంబర్‌కి ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. అయితే మీ మొబైల్‌ నంబర్‌ ఆధార్‌ డేటాబేస్‌లో నమోదై ఉంటేనే ఇది పనిచేస్తుంది.

వివరాలు తప్పనిసరిగా మ్యాచ్‌ అవ్వాలి
పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేటప్పుడు పాన్‌కార్డులోని వివరాలు ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలతోమ్యాచ్‌ కావాలి. అప్పుడే ఈ రెండూ అనుసంధానం అవుతాయి. చాలా మందికి ఇక్కడే సమస్య ఎదురవుతోంది. కొందరి పేరు, పుట్టిన తేదీ ఆధార్‌లో ఒకలా పాన్‌ కార్డులో మరోలా ఉంటుంది. అలాంటి వాళ్లు​ వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్‌ పంపించి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేరు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు ముందుగా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డులో తప్పుగా ఉన్న వివరాలు సరిచేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా అనుసంధానం చేసుకోవచ్చు.
పాన్‌కార్డులో మార్పు చేర్పులకు ఈ కింది వెబ్‌సైట్‌ సంప్రదించాలి. 

http://tin.tin.nsdl.com/pan/correctiondsc.html
 You may be interested

30రోజులకు టాప్‌-6 రికమెండేషన్లు

Saturday 15th February 2020

1.కంపెనీ పేరు: హీరో మోటోకార్ప్‌ బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ  సెక్యూరిటీస్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.2356.50 టార్గెట్‌ ధర: రూ.2980.00 కాలపరిమితి: స్వల్పకాలం( 1 నెల) విశ్లేషణ: ద్విచక్ర వాహనాలపై పెంచిన ధరలు స్వల్పకాలంలోనే నష్టాలను రికవరీ చేయగలవు. ఈ ఏడాది రెండో భాగంలో రివకరీతో ఆర్థిక సంవత్సరపు 21లో  వాల్యూమ్స్‌లు 5 శాతం ఉప వృద్ధి చెందుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తుంది.  2.కంపెనీ పేరు: మైండ్‌ ట్రీ బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.959.90 టార్గెట్‌ ధర: రూ.1100.00 కాల పరిమితి: స్వల్పకాలం(1నెల) విశ్లేషణ: యాన్యుటీ రెవెన్యూ, టెయిల్ అకౌంట్ హేతుబద్ధీకరణపై

లబ్ది ఎయిర్‌టెల్‌కా? జియోకా?

Saturday 15th February 2020

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మధ్య పోటీ తీవ్రం! ఎయిర్‌టెల్‌ వ్యయాలు పెరగవచ్చంటున్న నిపుణులు 40 శాతం వొడాఫోన్‌ కస్లమర్లు ఎయిర్‌టెల్‌ చెంతకు? ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా ఎలా స్పందించనుం‍దన్న అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలు, వడ్డీలు, పెనాల్టీలు తదితరాలతో కలసి వొడాఫోన్‌ ఐడియా బకాయిలు రూ. 53,000 కోట్లను అధిగమించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది

Most from this category