News


ఆధార్‌తోనే ఐటీ రిటర్నులు

Saturday 6th July 2019
news_main1562400974.png-26868

  • పాన్‌కార్డు లేకున్నా పర్వాలేదు
  • ఇక స్క్రూటినీ కూడా ఆన్‌లైన్‌లోనే
  • మరింత సులభంగా రిటర్నులు దాఖలు

సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటే ఇప్పటి వరకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇపుడు పాన్‌ కార్డు లేకపోయినా రిటర్నులు దాఖలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాన్‌కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌ కార్డు నెంబర్‌ను ఇవ్వడం ద్వారా ఇక నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దేశంలో ఇప్పటికే ఆధార్‌ కార్డులున్న వారి సంఖ్య 120 కోట్లు దాటడం, సుమారు అన్ని ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయడంతో ఇక పాన్‌ కార్డు లేకపోయినా ఆధార్‌ కార్డు నెంబరును పేర్కొనడం ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయడం కూడా మరింత సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జీతం ఆదాయం కాకుండా బ్యాంకు వడ్డీ, డివిడెండ్లు, క్యాపిటల్‌ గెయిన్స్‌ వంటి ఇతర ఆదాయాలు ఉన్న వారు వివిధ ఐటీఆర్‌ ఫారాలను వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ వివరాలను తెలియచేయాల్సిన అవసరం లేదు. వీటి స్థానంలో ప్రీ ఫిల్డ్‌ ఐటీఆర్‌ ఫారంలు అందుబాటులోకి వస్తున్నాయి. ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేయడానికి బ్యాంకులు, స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలు, మూచువల్‌ ఫండ్స్‌, ఈపీఎఫ్‌వో, రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రిటర్నుల స్క్రూటినీలు కూడా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే చేయనున్నామని, అలాగే స్టార్టప్‌లకు స్క్రూటినీల నుంచి మినహాంపు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం స్క్రూటినీకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే కావాల్సిన సమాచారాన్ని అడిగి తీసుకుంటారు. 



You may be interested

మిశ్రమంగా ఐటీ కంపెనీల ఫలితాలు: బ్రోకరేజ్‌ సంస్థలు

Saturday 6th July 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఐటీ సేవల కంపెనీల డిమాండ్‌ కొనసాగవచ్చని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, డాలర్‌ క్షీణత, వేతనాల పెరుగుదల, అట్రిషన్‌ (ఉద్యోగ వలసలు)రేటు, వీసా సమస్యలు, డాలర్‌ మారకంలో రూపాయి పుంజుకోవడం తదితర కారణాలతో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని అంటున్నాయి. టైర్‌ -I విభాగపు కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఈ రంగంలో వృద్ధిని సాధించనున్నాయని, టైర్‌ - 2

కోటి దాటితే కోతే!!

Saturday 6th July 2019

 బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాకు పరిమితులు  అది దాటితే 2 శాతం సర్‌ఛార్జీ తప్పదు రూ.50 కోట్లు టర్నోవర్‌ దాటని కంపెనీలకు వరాలు డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు తొలగింపు ‘డిజిటల్‌’ భారతం కోసం ముందడుగు! సాక్షి, అమరావతి: వ్యవస్థలో నగదు చెలామణీని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచే దిశగా కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో నగదు రూపంలో కోటి రూపాయలు మించి విత్‌డ్రా చేస్తే అదనంగా కొంత చేతి చమురు

Most from this category