News


రూ. 10వేల కోట్ల సమీకరణలో ఓయో

Tuesday 8th October 2019
news_main1570509993.png-28767

  • అమెరికా, యూరప్‌లో విస్తరణకు వినియోగం

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్.. ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌ ద్వారా 700 మిలియన్ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న ఇన్వస్టర్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించినట్లు అగర్వాల్ చెప్పారు. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్, లైట్‌స్పీడ్‌, సెకోయా క్యాపిటల్‌ తదితర ఇన్వెస్టర్లు తమకు పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్‌లో సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు కొన్నాళ్ల క్రితం అనుమతులు లభించాయి. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 35,000 హోటల్స్‌ .. 1,25,000 పైచిలుకు వెకేషన్ హోమ్స్‌ ఉన్నాయి. 


OYO

You may be interested

ఈ-అసెస్‌మెంట్ వ్యవస్థ ప్రారంభం

Tuesday 8th October 2019

- తొలిదశలో పరిశీలనకు 58 వేల కేసులు - ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు న్యూఢిల్లీ: పన్ను విధానాల సంస్కరణల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక ప్రతిపాదనను అమల్లోకి తెచ్చింది. పన్నుల మదింపు ప్రక్రియలో అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ఎలక్ట్రానిక్‌ (ఫేస్‌లెస్‌) అసెస్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్‌ను (ఎన్‌ఈఏసీ) కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ భూషణ్ పాండే సోమవారం ప్రారంభించారు.

ఏసీలు, ఫ్రిజ్‌లు రయ్‌రయ్‌!

Tuesday 8th October 2019

క్యూ1లో ఎలక్ట్రికల్‌ ఉపకరణాల అమ్మకాల జోరు ఏసీల విక్రయాలు 20 శాతం అప్‌ ఫ్రిజ్‌లు 12 శాతం వృద్ధి న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్‌ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్‌ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌

Most from this category