News


ఓయో నష్టాలు 335 మిలియన్‌ డాలర్లు

Tuesday 18th February 2020
news_main1581995599.png-31872

న్యూఢిల్లీ: ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ కన్సాలిడేటెడ్‌ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సం‍స్థ 335 మిలియన్‌ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్‌ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్‌ డాలర్ల నుంచి 951 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణ నష్టాలు పెరగడానికి కారణమైంది. దేశీయ కార్యకలాపాలపై నష్టాలను మొత్తం ఆదాయంలో 24 శాతం నుంచి 12 శాతానికి సంస్థ తగ్గించుకుంది. 



You may be interested

ఈ సారి సాఫీగా ఎయిర్‌ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌

Tuesday 18th February 2020

ఎలాంటి ఇబ్బందులు ఉండవు  విమానయాన శాఖ మంత్రి భరోసా న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం ఈ సారి సాఫీగా జరిగిపోనున్నదని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం సత్తా గల కంపెనీలు మరింత ఆసక్తిగా ఉన్నాయని చెప్పారాయన. అందుకని ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం విషయంలో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తబోవన్నారు. భవిష్యత్తులో కూడా ఒక బ్రాండ్‌గా ఎయిర్‌ ఇండియా

త్వరలోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ !

Tuesday 18th February 2020

ఈ నెల చివర్లో... లేదా మార్చి మొదట్లో ఇష్యూ పరిమాణం రూ.6,000 కోట్లపైనే ముకేశ్‌ ట్రెండ్స్‌ లైఫ్‌ స్టైల్‌ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల చివరి వారంలో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ఉండొచ్చని సమాచారం. ఈ ఐపీఓకు ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం

Most from this category