News


92 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 26th November 2019
news_main1574742234.png-29858

  • బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల్లో విశేష స్పందన

న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.  రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.  బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.  కేంద్రం అందిస్తున్న  పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది.  నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. 



You may be interested

జొమాటో చేతికి ఉబెర్‌ఈట్స్‌..!

Tuesday 26th November 2019

డీల్‌ విలువ 500 మిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రెస్టారెంట్ యాగ్రిగేటర్‌, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ ఉబెర్‌ఈట్స్‌ను కైవసం చేసుకునే దిశగా పావులుకదుపుతోంది. ఉబెర్‌ఈట్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ 500 మిలియన్‌ డాలర్లను ఆస్క్‌ ప్రైస్‌గా కోట్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కాగా, జొమాటో ఈ మొత్తాన్ని చెల్లించడానికి

బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు!

Tuesday 26th November 2019

గత కొన్ని సెషన్‌ల నుంచి జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ట్రేడయిన బ్యాంక్‌ నిఫ్టీ, కొనుగోలు మద్దతు లభించడంతో  మంగళవారం సెషన్‌లో కొత్త ఆల్‌టైం రికార్డును సృష్టించింది. గత సెషన్‌లో 31,555.90 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ మంగళవారం సెషన్‌లో 31,692.85 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ ఏడాది జూన్‌ 4 న ఏర్పరిచిన 31,752 రికార్డు స్థాయిని అధిగమించి 31,796.20 వద్ద కొత్త జీవిత కాల

Most from this category