STOCKS

News


బీఎస్‌ఎన్‌ఎల్‌లో 77,000కుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Wednesday 20th November 2019
news_main1574220956.png-29717

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు.  70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.  కేంద్రం అందిస్తున్న  పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది.  నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది.



You may be interested

భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు

Wednesday 20th November 2019

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్‌ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్‌, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన

కొనుగోలు శక్తి తగ్గొచ్చు...

Wednesday 20th November 2019

ఎస్‌బీఐ ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ సారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌

Most from this category