News


3,400 ప్రభుత్వరంగ బ్యాంకు శాఖలు మాయం

Monday 4th November 2019
news_main1572838389.png-29317

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఆర్‌బీఐకి చేసుకున్న దరఖాస్తు ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75 శాతం బ్యాంకు శాఖలు ఎస్‌బీఐకి చెందినవే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం ఎస్‌బీఐతోనే ఆరంభమైన విషయం తెలిసిందే. అనుబంధ బ్యాంకులతోపాటు భారత్‌ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి. ఎస్‌బీఐకి సంబంధించి మొత్తం 2,568 శాఖలను గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విలీనం లేదా మూసేయడం జరిగింది. 



You may be interested

ఐపీఓకు సౌదీ అరామ్‌కో

Monday 4th November 2019

లాంఛనంగా ప్రకటించిన కంపెనీ  ఈ నెల 9న మరిన్ని వివరాలు డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌  దహ్రన్‌(సౌదీ అరేబియా):- సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు ఈ నెలలో సాకారమవుతోంది.  బుక్‌ బిల్డింగ్‌ విధానంలో

డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ

Monday 4th November 2019

రూ. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై  యస్‌ బ్యాంక్ ప్రణాళిక కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం కల్పించే యోచన 33 శాతం వాటాలకు అవకాశం ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్‌ ఆఖరునాటికల్లా పూర్తి యోచిస్తోంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు

Most from this category