News


125 కోట్ల మందికి ఆధార్‌

Saturday 28th December 2019
news_main1577505302.png-30488

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్ధనలు నమోదవుతున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్‌డేట్ అభ్యర్ధనలు కూడా రోజుకు 3-4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది. 

సీఎస్‌సీల్లో మళ్లీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సేవలు ...
కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖలో భాగమైన సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ సంస్థ మళ్లీ ఆధార్ రిజిస్ట్రేషన్‌, సంబంధిత సర్వీసులను ప్రారంభించింది. వచ్చే వారం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనుంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌, మార్పులు.. చేర్పులు వంటి సేవలు అందించేందుకు .. యూఐడీఏఐతో సీఎస్‌సీ ఎస్‌పీవీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ).. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఆన్‌లైన్ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నాయి. డేటా లీకేజీ, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీఎస్‌సీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సేవలు రెండేళ్ల క్రితం నిల్చిపోయాయి. 



You may be interested

నాస్‌డాక్‌ 11 రోజుల ర్యాలీకి బ్రేక్‌

Saturday 28th December 2019

యూఎస్‌ మార్కెట్లు అటూఇటూ డోజోన్స్‌ ప్లస్‌లో- నాస్‌డాక్‌ మైనస్‌ ఎస్‌అండ్‌పీ-500 యథాతథం వారాంతాన యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 24 పాయింట్ల(0.08 శాతం) స్వల్ప లాభంతో 28,645 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ దాదాపు యథాతథంగా 3240 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌  16 పాయింట్లు(0.17 శాతం) తక్కువగా 9007 వద్ద ముగిసింది. వెరసి నాస్‌డాక్‌ 11 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ చివర్లో పెరిగిన అమ్మకాలు ప్రభావం

కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌

Saturday 28th December 2019

 చెల్లించిన ఎల్‌ఐసీ  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎమ్‌.ఆర్‌. కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి దేబాశిష్‌ పాండాలు కూడా పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 10 శాతం వృద్ధితో రూ.53,214 కోట్ల

Most from this category