News


దక్షిణాదిన ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ ప్లాంటు!

Friday 17th January 2020
news_main1579231488.png-30977

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందును కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ జైన్‌  వెల్లడించారు. ఎలిగంజా సిరీస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కేంద్రంలో ఫ్యాన్లతోపాటు ఇతర ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తామన్నారు. కాగా, ఎలిగంజా సిరీస్‌లో ఫ్యాన్‌తో కూడిన షాండెలియర్స్‌ను ఆవిష్కరించారు. ధరల శ్రేణి రూ.17,500-23,500 మధ్య ఉంది. ప్రీమియం ఫ్యాన్ల విపణిలో ఓరియంట్‌కు 50 శాతం మార్కెట్‌ వాటా ఉందని కంపెనీ బ్రాండ్‌ హెడ్‌ అన్షుమన్‌ చక్రవర్తి తెలిపారు. ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ 2018-19లో సుమారు రూ.2,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 20 శాతం వృద్ధి నమోదు చేసింది. 



You may be interested

మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’

Friday 17th January 2020

బీఎస్‌-6 ప్రమాణాలతో 110 సీసీ స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 63,912 ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్‌ స్టాండర్డ్‌, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912- 65,412 (ఎక్స్‌-షోరూం,

సైయంట్‌ లాభం రూ.108 కోట్లు

Friday 17th January 2020

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) ఆర్థిక ఫలితాల్లో సైయంట్‌ మిశ్రమ ఫలితాలు సాధించింది. నికరలాభం గణనీయంగా పెరిగినా... మొత్తం ఆదాయంలో మాత్రం క్షీణత నమోదయింది. క్యూ3 కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.108 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ2లో నికరలాభం రూ.98.5 కోట్లుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.92 కోట్లుగా ఉంది. లాభాల్లో క్యూ2తో పోలిస్తే 10 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 17.6 శాతం

Most from this category