News


ఒప్పొ ఫోన్‌ నుంచి ‘రెనో 2’ సిరీస్‌

Thursday 29th August 2019
Markets_main1567061533.png-28091

  • ధరల శ్రేణి రూ.29,990- 36,990

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా భారత మార్కెట్లోకి ‘రెనో 2’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రెనో 2, రెనో 2 జెడ్, రెనో 2 ఎఫ్’ పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను తాజా సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 2 ధర రూ.36,990 కాగా, సెప్టెంబర్‌ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెనో 2 జెడ్ ధర రూ.29,990 ఉండగా, ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబరు 6న వినియోగదారులకు ఇది లభ్యంకానుంది. రెనో 2 ఎఫ్ నవంబరులో అందుబాటులోకిరానుంది. తాజా సిరీస్‌తో కంపెనీ మార్కెట్‌ వాటా ఈఏడాదిలో 10 శాతానికి చేరుకోవాలనేది తమ లక్ష్యమని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుమిత్ వాలియా అన్నారు.



You may be interested

‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది..!

Thursday 29th August 2019

వాయిదా పద్దతిలో కొనుగోలుకు అవకాశం నెలకు రూ. 3,499 న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌.. తన తొలి ఈ-మోటార్‌సైకిల్‌ ‘ఆర్‌వీ 400’ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో ఈ బైక్‌ను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తూ.. స్పెషల్‌ పేమెంట్‌ స్కీంను ప్రకటించింది. నెలకు రూ. 3,499 చొప్పున 37 నెలలు చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ బైక్‌ ప్రీ-బుకింగ్స్‌ జూన్‌ 25 నుంచి

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

Thursday 29th August 2019

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్‌’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్‌ సెవన్‌ - సీటర్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0-లీటర్‌ 3-సిలెండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నట్లు

Most from this category