News


టాప్‌ 500 షేర్లలో మనవి పదమూడే!

Wednesday 27th November 2019
news_main1574837612.png-29897

అంతర్జాతీయంగా మంచి ప్రదర్శన చూపిన టాప్‌ 500 షేర్ల జాబితాలో ఇండియాకు చెందిన 13 షేర్లకు మాత్రమే చోటు దక్కింది. దేశీయ సూచీల్లో బ్లూచిప్స్‌ ప్రదర్శన కారణంగా ఆల్‌టైమ్‌ హై సాధ్యమైనా, గ్లోబల్‌ షేర్లతో పోలిస్తే మనవాటి ప్రదర్శన అంతంతమాత్రమేనని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌ 500 కంపెనీలను బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ప్రకటించింది. ఈ లిస్టులోని 13 భారతీయ కంపెనీల షేర్లలో 8 షేర్లు కనీసం టాప్‌ 200లోకి చేరే ప్రదర్శన చూపలేకపోయాయి. దేశీయ మార్కెట్లో వాల్యూషన్ల పరంగా ఎస్‌బీఐని తోసిరాజని పదోస్థానానికి చేరిన బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు బ్లూమ్‌బర్గ్‌ 500 జాబితాలో టాప్‌ ఇండియన్‌ షేరుగా నిలిచింది. ఈ షేరు 2019లో దాదాపు 55 శాతం ర్యాలీ జరిపింది. మొత్తం లిస్టులో ఈ షేరుకు 48వ స్థానం దక్కింది. జాబితాలో చివరి ఇండియన్‌ కంపెనీగా ఐటీసీ నిలిచింది. ఈ ఏడాది ఐటీసీ 13 శాతం నష్టం మూటకట్టుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్‌ 500లో 475వ స్థానం దక్కించుకుంది. మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజాలు సైతం 400 ర్యాంకుకు దిగువనే నిలిచాయి. 

బజాజ్‌ ఫైనాన్స్‌ తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, కోటక్‌ బ్యాంకు షేర్లు జాబితాలో నిలిచాయి. అంతర్జాతీయ కంపెనీలన్నింటిలో చైనాకు చెందిన వులియంగే ఇబిన్‌ 161 శాతం లాభపడి సూచీలో తొలి స్థానం దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో షాపిఫై, బ్లాక్‌స్టోన్‌, ఎల్‌ఎస్‌ఈ, ఆపిల్‌ షేర్లు నిలిచాయి. ఈక్విటీ సూచీల పరంగా ఇండియా ఈక్విటీలు సైతం ఇలాంటి ప్రదర్శనే చూపాయి. ఇతర గ్లోబల్‌ ఇండెక్స్‌లతో పోలిస్తే నిఫ్టీ ఈ ఏడాది తక్కువ ర్యాలీనే జరిపింది. 2019లో నిఫ్టీ 12 శాతం ర్యాలీ జరపగా యూఎస్‌కు చెందిన ఎస్‌అండ్‌పీ 500, జర్మనీ డీఏఎక్స్‌ సూచీలు 23 శాతం, చైనా షాంఘై సూచీ 17 శాతం అప్‌మూవ్‌ చూపాయి. 



You may be interested

వచ్చే ఏడాది ర్యాలీలో అధికశాతం షేర్లకు చోటు

Wednesday 27th November 2019

‘సిమెంట్‌, ఇండస్ట్రీయల్స్‌, పవర్‌, ఆటో, వినియోగం వంటి రంగాలు 10 శాతం నుంచి 30 శాతం మేర పడిపోయాయి. ఈ రంగాలలో బాటమ్‌ ఔట్‌ అయ్యి డిమాండ్‌ తిరిగి పుంజుకుంటే, మార్కెట్‌ మరింత పెరగుతుంది’ అని ఎండీ, సీఐఓ, టీసీజీ ఏఎంసీ, చక్రి లోకప్రియా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. మార్కెట్‌ మరింత పెరుగుతుంది.. ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి అంతర్జాతీయ కారణాలు, సెంటిమెంట్‌ మెరుగుపడడం

ఐసీఐసీఐ టార్గెట్‌ రూ.775: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఐసీఐసీఐ బ్యాంక్‌  షేరు టార్గెట్‌ ధరను పెంచింది. ఈ మేరకు బ్రోకరేజ్‌ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో షేరుకు తాము కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను రూ.665ల నుంచి రూ.775లకు పెంచుతున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో ఈ షేరు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. ఈ బ్యాంకులో ఒక సూపర్‌ నార్మల్‌ ప్రాఫిట్‌ సైకిల్‌ తయారుకానుంది.

Most from this category