News


ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!

Friday 6th September 2019
news_main1567741715.png-28231

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్లో విహరించడం సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్‌ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్‌ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది ఓవర్‌ ద టాప్‌ యూజర్లు పాల్గొన్నారు. వీరిలో 87 శాతం మంది ఆన్‌లైన్‌ కంటెంట్‌ను తమ ఫోన్లలోనే వినియోగిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్య వీడియోలు, చిత్రాలను చూస్తున్నవారు 28 శాతం మంది ఉన్నారు. వీరు మూవీస్‌నే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఒరిజినల్‌, కొత్త కంటెంట్‌ను ఆస్వాదించేందుకే ఇష్టపడుతున్నారు. నాణ్యమైన కంటెంట్‌ ఉన్న కారణంగానే 87 శాతం మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారట. ఇంగ్లీషు, హిందీ కాకుండా స్థానిక భాషల్లో లభించే వీడియోలపట్ల 30 శాతం మంది ఆసక్తి కనబరిచారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక భాషలకే పట్టం కడుతున్నారు.You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 6th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బజాజ్‌ ఫైనాన్స్‌:- క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఈ సెప్టెండర్‌ 17న కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించునుంది. టీసీఎస్‌:- పోస్టెన్ నార్జ్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  డాటామాస్టిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌:- బెంగళూర్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ తన డిజిటల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ భాగస్వామిగా ఎన్నుకుంది.  ప్రభాత్‌ డైరీ:- డీలిస్టింగ్‌ ప్రపోజల్‌పై చర్చించేందకు సెప్టెంబర్‌ 10న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఇండోసోలార్‌:- కం‍పెనీ సీఈవోగా అనంద్‌ కుమార్‌

28 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు

Friday 6th September 2019

-ఈ క్యూ1లో 1,633 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు  -సేవల రంగంలో అత్యధికం  -ప్రభుత్వ గణాంకాలు వెల్లడి  న్యూఢిల్లీ: భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఎఫ్‌డీఐలు 28 శాతం వృద్ధి చెందాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మౌలిక రంగంలో జోరు ద్వారా వృద్ది జోష్‌నందుకోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కీలకం. ఎఫ్‌డీఐల జోరు పెంచడానికి ఇటీవలనే ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. సింగిల్‌ బ్రాండ్‌

Most from this category