News


విదేశీ దిగుమతుల తగ్గింపే లక్ష్యం

Saturday 17th November 2018
news_main1542433260.png-22133

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు విదేశాల నుంచి ఆయిల్‌ దిగుమతిని 10 శాతం తగ్గించటమే లక్ష్యంగా ఓఎన్‌జీసీ పని చేస్తోందని దాని అనుబంధ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్‌ డైరెక్టర్‌ పి.కె.రావు చెప్పారు. విదేశాల్లో సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగిస్తున్నట్లు చెప్పారాయన. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అసెట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2002 నుంచి ఓఎన్‌జీసీ వివిధ దేశాల కంపెనీలతో కలసి సంయుక్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 20 దేశాల్లో 41 ప్రాజెక్టులు చేపట్టాం. రష్యాలోని వెల్‌లో మైనస్‌ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్స్‌ చేపడుతున్నాం. కొలంబియాలో 3200 బ్యారల్స్‌ ఉత్పిత్తి చేయగల బావిని సొంతంగా తవ్వాం’’ అని వివరించారు. ప్రస్తుతం తమ చమురు ఉత్పత్తి సామర్థ్యం 14.1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుందని, దీన్ని 2030 నాటికి 60 ఎంఎంటీకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారాయన. సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల నుంచి మన వాటాగా 26 శాతం వస్తోందని చెప్పారు. సమావేశంలో ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీఎంఆర్‌ శేఖర్, గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కె.పాండే, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ అధికారి ఎం.డి.జమీల్‌ తదితరులు పాల్నొన్నారు.You may be interested

కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!

Saturday 17th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్‌లైన్‌లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్‌లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్‌కు చెందిన విక్రమ్‌ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే  ‘ఓన్లీ రైస్‌.కామ్‌’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్,

ఆర్థిక విధానాలపై అర్థవంతమైన చర్చ అవసరం: జైట్లీ

Saturday 17th November 2018

ముంబై: నినాదాలు, ప్రజాకర్షణలు ఆర్థిక విధానాలను నడిపించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక విధానాలపై వాస్తవాలు, పూర్తి సమాచారం ఆధారంగా తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మనీకంట్రోల్‌ సంస్థ నిర్వహించిన వెల్త్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. దేశంలో నాణ్యమైన చర్చలు కొరవడ్డాయన్న ఆయన, ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరగాలన్నారు. కేవలం ప్రకటనలపైనే

Most from this category