News


సగం తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

Saturday 15th February 2020
news_main1581738084.png-31812

  • చమురు, గ్యాస్‌ ధరలు తగ్గాయ్‌ 
  • ఉత్పత్తి కూడా క్షీణించింది 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో సగం తగ్గింది. గత క్యూ3లో రూ.8,263 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో 50 శాతం క్షీణించి రూ.8,263 కోట్లకు తగ్గిందని ఓఎన్‌జీసీ తెలిపింది. చమురు, గ్యాస్‌ ధరలు పతనం కావడం, ఉత్పత్తి కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ముడి చమురు ధరలు 10 శాతం, నేచరల్‌ గ్యాస్‌ ధరలు 4 శాతం మేర తగ్గాయని తెలిపింది. చమురు ధరలు తగ్గడంతో ఆదాయం 14 శాతం క్షీణించి రూ.23,710 కోట్లకు తగ్గిందని పేర్కొంది. చమురు ఉత్పత్తి 1 శాతం, గ్యాస్‌ ఉత్పత్తి 8 శాతం మేర తగ్గాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది చమురు, గ్యాస్‌ నిక్షేపాలను కనుగొన్నామని తెలిపింది. 



You may be interested

ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌ కట్‌

Saturday 15th February 2020

- మార్చి 31 వరకు గడువు న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్) విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం తప్పదని ఇప్పటికే పలు సార్లు సూచించి, గడువు తేదీలను పొడగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. లింక్‌ కాని పాన్‌ కార్డులను పనిచేయకుండా (ఇన్‌ ఆపరేటివ్‌) చేయనున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇందుకు మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది.

జీవీకే పవర్‌కు రూ.96 కోట్ల నష్టం

Saturday 15th February 2020

(అప్‌డేటెడ్‌...) హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.96 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.101 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. టర్నోవరు రూ.1,109 కోట్ల నుంచి రూ.1,156 కోట్లకు ఎగసింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.930 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు చేరింది. 2019-20 తొమ్మిది నెలల్లో (ఏప్రిల్‌- డిసెంబరు)  రూ.3,257 కోట్ల

Most from this category