STOCKS

News


ఓఎన్‌జీసీ విజన్‌ 2040

Saturday 31st August 2019
news_main1567229053.png-28121

  • 15-16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
  • చమురు, గ్యాస్‌ ఉత్పత్తి రెట్టింపు
  • రిఫైనరీ సామర్థ్యం మూడింతలు
  • భారీ లక్ష్యాలతో కూడిన భవిష్యత్తు కార్యాచరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని చమురు, గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి సంస్థ ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు, విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దేశీయ, విదేశాల్లోని చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో ఉత్పత్తిని రెట్టింపు చేసుకోవడం, చమురు రిఫైనరీ సామర్థ్యాన్ని మూడింతలు పెంచుకోవడంతోపాటు, పునరుత్పాదక ఇంధనాల్లోకి ప్రవేశించడం తదితర లక్ష్యాలతో కూడిన భవిష్యత్తు కార్యాచరణను ‘విజన్‌ డాక్యుమెంట్‌ 2040’లో విశదీకరించింది. ఓఎన్‌జీసీని భవిష్యత్తు కాలానికి సన్నద్ధం చేయడమే ఈ భవిష్యత్తు దర్శిని నివేదిక లక్ష్యమని ఓఎన్‌జీసీ చైర్మన్‌, ఎండీ శశి శంకర్‌ తెలిపారు. డైవర్సిఫైడ్‌ ఇంధన కంపెనీగా, అన్వేషణ, ఉత్పత్తి కాకుండా ఇతర వ్యాపారాల నుంచి గణనీయమైన ఆదాయాలు వస్తాయని వివరించారు. 2040 నాటికి ఆదాయాలు మూడు రెట్లు, మార్కెట్‌ విలువ 5-6 రెట్లు పెరిగే విధంగా ఉంటుందన్నారు. ఓఎన్‌జీసీ 2018-19లో 24.23 మిలియన్‌ టన్నుల చమురు, 25.81 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్ల (బీసీఎం) సహజ వాయివును దేశీయంగా ఉన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసింది. అలాగే, విదేశీ క్షేత్రాల నుంచి 10.1 మిలియన్‌ టన్నుల చమురు, 4.73 బీసీఎం గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. టర్నోవర్‌ 1,09,654 కోట్లుగాను, నికర లాభం రూ.26,715 కోట్లుగాను ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికి మార్కెట్‌ విలువ రూ.1,64,458 కోట్లు.
100 మిలియన్‌ టన్నులకు రిఫైనరీ 
2018-19లో ఓఎన్‌జీసీ రూ.29,449 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) రూ.32,921 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. 
‘‘మా క్షేత్రాలు పాత కాలం నాటివి. 30-50 ఏళ్ల నుంచి నడుస్తు‍న్నవి. కనుక ఉత్పత్తి పడిపోకుండా, జీవిత కాలం పెంచేందుకు వాటి పునర్నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నాం’’ అని శశి శంకర్‌ వెల్లడించారు. చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు గత కొన్ని సంవత్సరాల నుంచి 27 భారీ ప్రాజెక్టులపై రూ.86,000 కోట్లను దశలవారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రణాళిక ప్రకారం విదేశీ ప్రాజెక్టులు, రిఫైనరీ సామర్థ్యం పెంపు, పునరుత్పాదక ఇంధనాలపై 15-16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. 2040 నాటికి పన్ను అనంతర లాభం ప్రస్తుత స్థాయి నుంచి నాలుగు రెట్లు పెరుగుతుందని శంకర్‌ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ ఈ రెండూ ఓఎన్‌జీసీ అనుబంధ కంపెనీలు కాగా, వీటి రిఫైనరీ సామర్థ్యం 35 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఈ సామర్థ్యాన్ని 90-100 మిలియన్‌ టన్నులకు పెంచడమే లక్ష్యమని శంకర్‌ తెలిపారు. పెట్రోకెమికల్స్‌ విస్తరణ తమ ప్రాధాన్యమని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై పెట్టుబడులు పెట్టడం ద్వారా 5-10 గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్తుకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
వచ్చే ఏడాదే విలీనం...
ఎంఆర్‌పీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ విలీనంపై శశి శంకర్‌ సంకేతమిచ్చారు. వచ్చే ఏడాది ఇది చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విలీనంపై కసరత్తు జరుగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే ఓ కన్సల్టెంట్‌ను నియమించనున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) లిస్టింగ్‌కు తాము అనుకూలంగా లేమని శంకర్‌ చెప్పారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చిందని, ఇది సరైన సమయం కాదని తాము ప్రభుత్వానికి తెలియజేసినట్టు వివరించారు. You may be interested

తాన్లా చేతికి గమూగా సాఫ్ట్‌టెక్‌

Saturday 31st August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ రంగంలో ఉన్న తాన్లా సొల్యూషన్స్‌ బిగ్‌ డేటా, ఏఐ ఆధారిత మార్కెటింగ్‌ ఆటోమేషన్‌ కంపెనీ గమూగా సాఫ్ట్‌టెక్‌ను కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ.48.5 కోట్లు. 2011లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన గమూగా టర్నోవర్‌ 2017-18లో రూ.5.7 కోట్లు. రిలయన్స్‌, టైటాన్‌, స్విగ్గీ, జూమ్‌కార్‌, రెడ్‌బస్‌ వంటి 40కిపైగా కంపెనీలకు సేవలందిస్తోంది.

జీడీపీ.. ఢమాల్‌!

Saturday 31st August 2019

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో  కేవలం 5 శాతం వృద్ధి తయారీ రంగం నెమ్మది కేవలం 0.6 శాతం వృద్ధి సాయం చేయని వ్యవసాయం వృద్ధి కేవలం 2 శాతం  క్యూ1లో చైనా వృద్ధి 6.2 శాతం దీనితో ఈ త్రైమాసికంలో ‘వేగంగా వృద్ధి’  హోదా కోల్పోయిన భారత్‌ న్యూఢిల్లీ: భారత ఆర్థికరంగం తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012-13 ఏప్రిల్‌-జూన్‌

Most from this category