News


వన్‌ప్లస్ టీవీలూ వస్తున్నాయ్‌..

Thursday 22nd August 2019
news_main1566445792.png-27928

  • సెప్టెంబర్‌లో మార్కెట్లోకి
  • తొలిసారిగా భారత్‌లోనే ఆవిష్కరణ

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా స్మార్ట్‌ టీవీలను అందుబాటులోకి తెస్తోంది. సెప్టెంబర్‌లో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. చైనా కన్నా ముందుగా భారత మార్కెట్లోనే స్మార్ట్‌ టీవీలను ప్రవేశపెడుతుండటం గమనార్హం. "వన్‌ప్లస్‌ టీవీలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించబోతున్నాం. వీటిని ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెస్తున్నాం" అని వన్‌ప్లస్‌ ఫోరంలో సంస్థ సీఈవో పీట్ లౌ వెల్లడించారు. అయితే, టీవీ ధర, ఇతరత్రా ఫీచర్స్‌ మొదలైన వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ కూడా గతేడాది నుంచే భారత్‌లో టీవీలను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. ఇక శాంసంగ్‌, ఎల్‌జీ, మైక్రోమ్యాక్స్ వంటి ఇతరత్రా ఫోన్స్ తయారీ సంస్థలకు కూడా సొంతంగా టీవీ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాటి బాటలోనే వన్‌ప్లస్‌ సంస్థ సైతం స్మార్ట్‌టీవీల విభాగంలోకి అడుగుపెడుతోంది. 
    గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నామని, క్రమంగా ఒక్కో మార్కెట్‌లో ఈ టీవీలను ప్రవేశపెడతామని పీట్ వివరించారు. భారత్‌లో వివిధ కంటెంట్‌ ప్రొవైడర్స్‌తో తమకు సత్సంబంధాలు ఉండటంతో యూజర్లకు మరింత మెరుగైన కంటెంట్‌ను అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర అమెరికా, యూరప్‌, చైనా తదితర మార్కెట్లలో కూడా వన్‌ప్లస్ టీవీని ఆవిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ కంటెంట్ ప్రొవైడర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నామని పీట్ వివరించారు. "మేం ప్రతీ చిన్న విషయంపైనా దృష్టి పెడతాం. భవిష్యత్‌ స్మార్ట్ టీవీలకు ప్రమాణాలు నిర్దేశించేలా మా ఉత్పత్తి ఉండాలన్నది మా లక్ష్యం" అని ఆయన చెప్పారు. 2019 జూన్ క్వార్టర్‌లో భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో (రూ. 30,000 పైగా ధర ఉండే ఫోన్స్‌) వన్‌ప్లస్‌ 43 శాతం వాటాతో అగ్రస్థానంలో నిల్చింది. 



You may be interested

నెగిటివ్‌ ప్రారంభం

Thursday 22nd August 2019

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35 పాయింట్ల తగ్గుదలతో 37,025 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్ల క్షీణతతో 10.903 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. కాగా కొద్ది నిముషాల్లోనే సెన్సెక్స్‌ నష్టం 130 పాయింట్లకు, నిఫ్టీ నష్టం 40 పాయింట్లకు చేరిపోయింది. 

అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ ప్రారంభం

Thursday 22nd August 2019

గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల్లో స్థాపన నిర్మాణానికి రూ.1,500 కోట్లకుపైగా వ్యయం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాటు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్‌ స్పేస్‌ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి

Most from this category