News


వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌ హైదరాబాద్‌లో..

Tuesday 23rd July 2019
news_main1563863803.png-27249

  • 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం
  • కంపెనీ జీఎం వికాస్‌ అగర్వాల్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ వన్‌ప్లస్‌ అతిపెద్ద​ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో ఇది ఏర్పాటవుతోంది. కంపెనీకి ప్రపంచంలో ఇదే అతిపెద్ద, సొంత స్టోర్‌. ఈ ఏడాది చివరినాటికి నిర్మాణం పూర్తి కావొచ్చని సంస్థ భావిస్తోంది. వన్‌ప్లస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆరు అంతస్తుల్లో సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రెస్టారెంట్‌, ప్లే ఏరియా వంటివి అందుబాటులోకి వస్తాయని కంపెనీ జీఎం వికాస్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వన్‌ప్లస్‌ ఉత్పత్తుల విక్రయం కోసం ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా సోమవారం ఆయన సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. ‘ఇప్పటికే హైదరాబాద్‌ గచ్చిబౌలిలో వన్‌ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఉంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కొన్నేళ్లలో ఈ సంఖ్య వేలకు చేరుకుంటుంది. ఆర్‌అండ్‌డీ పరంగా సంస్థకు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుంది. వన్‌ప్లస్‌ టీవీ అభివృద్ధి దశలో ఉంది. కొద్ది రోజుల్లో విడుదల చేస్తాం’ అని వివరించారు. 



You may be interested

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

Tuesday 23rd July 2019

అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: బిట్‌ కాయిన్‌, ఎథేరియం, రిపిల్‌, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ  కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ

మూతబడుతున్న పేమెంట్స్‌ బ్యాంకులు

Tuesday 23rd July 2019

ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత నిర్ణయం ముందుగానే తప్పుకున్న మూడు సంస్థలు     ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్‌ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్‌ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌

Most from this category