News


వన్‌ప్లస్‌ 55-అంగుళాల ఆండ్రాయిడ్‌ టీవీ విడుదల

Friday 27th September 2019
news_main1569557800.png-28578

  • ప్రారంభ ధర రూ. 69,900

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్‌ డాట్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 - రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్‌ఆర్‌డీ 10ప్లస్‌ సపోర్ట్‌, 50వాట్స్‌ ఎనిమిది-స్పీకర్ల సెటప్, సినిమాటిక్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

‘7టీ స్మార్ట్‌ఫోన్‌’ విడుదల
పండుగల సీజన్‌ నేపథ్యంలో అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్‌ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘7టీ’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.37,999 కాగా, మునుపటి వెర్షన్‌ 7కి కొనసాగింపుగా దీన్ని విడుదలచేసింది. సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ముంబై పాప్-అప్‌లలో వినియోగదారులకు లభ్యంకానున్నట్లు ప్రకటించింది. 



You may be interested

ఏపీలో వికా గ్రూపు భారీ విస్తరణ

Friday 27th September 2019

11 మిలియన్‌ టన్నులకు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం కడప భారతీ సిమెంట్లో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏపీలో ప్రభుత్వ గృహ నిర్మాణంతో సిమెంటుకు డిమాండ్‌ కేంద్రం కార్పొరేట్ టాక్స్ తగ్గించడంతో కంపెనీల పెట్టుబడులు ‘సాక్షి’తో వికా గ్రూపు చైర్మన్ గై సిడోస్ సాక్షి, అమరావతి: ఫ్రెంచ్‌ సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికా ఇండియాలో భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కేంద్రం భారీగా తగ్గించడంతో రానున్న రోజుల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని

లిక్విడిటీ సమస్య లేదు

Friday 27th September 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని ప్రకటన న్యూఢిల్లీ: బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలను పెంచాయని, వినియోగం పెరుగుతోందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగం (2019 అక్టోబర్‌ నుంచి 2020 మార్చి వరకు) నుంచి ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. గురువారం ఢిల్లీలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్ల అధినేతలతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో

Most from this category