News


8 వరకూ ఒలెక్ట్రా ఓపెన్‌ ఆఫర్‌!

Wednesday 26th December 2018
news_main1545799202.png-23234

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ అమల్లోకి వచ్చింది. ఈ ఆఫర్‌ జనవరి 8న ముగుస్తుంది. ఒలెక్ట్రాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రమోటింగ్‌ కంపెనీలైన ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్‌తో పాటు మేఘా ఇంజనీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు కంపెనీలో మరో 26 శాతం వాటాను షేర్‌ హోల్డర్ల నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చి కొనుగోలు చేయాల్సి ఉంది. దీన్లో భాగంగా 2.37 కోట్ల షేర్లను షేరు రూ.175.30 చొప్పున కొనుగోలు చేయటానికి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాయి. యెస్‌ సెక్యూరిటీస్‌ ఈ ఓపెన్‌ ఆఫర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. సోమవారం ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేరు ధర అంత క్రితం ముగింపుతో పోలిస్తే 1.87 శాతం తగ్గి రూ.196.70 వద్ద స్థిరపడింది. ఓపెన్‌ ఆఫర్‌ ధర ప్రస్తుత మార్కెట్‌ ధర కన్నా దాదాపు 10 శాతం తక్కువ కావటం గమనార్హం.



You may be interested

నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

Wednesday 26th December 2018

న్యూఢిల్లీ: విజయాబ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

త్వరలో కొత్త రూ.20 నోటు విడుదల

Wednesday 26th December 2018

న్యూఢిల్లీ: అదనపు ఫీచర్లతో కూడిన కొత్త 20 రూపాయిల నోట్లను ఆర్‌బీఐ త్వరలోనే వ్యవస్థలోకి తీసుకురానుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ అప్పటి వరకు వ్యవస్థలో లేని రూ.2,000, రూ.200 నోట్లతోపాటు, కొత్త రూపంలో రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ సిరీస్‌ కింద వీటిని 2016 నవంబర్‌ తర్వాత తీసుకొచ్చింది. పాత నోట్లతో పోలిస్తే ఇవి రూపంలోనూ, సైజులోనూ భిన్నంగా ఉన్న

Most from this category