STOCKS

News


ఆటో మందగమనానికి ఓలా, ఊబర్‌ కాదు కారణం

Friday 13th September 2019
news_main1568349823.png-28347

పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సిన అవసరం
ఇప్పటికీ కారు కొనాలన్న ఆకాంక్ష ఉంది
మారుతి సుజుకీ శ్రీవాస్తవ అభిప్రాయం

గువహటి: యువత (మిలీనియల్స్‌/20-40 మధ్యనున్నవారు) కార్లు కొనడానికి బదులు ఓలా, ఊబర్‌ వంటి ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే ఆటోమొబైల్‌ వాహన విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాదనను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి అంగీకరించలేదు. వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం కానేకాదని, ఓ అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని పేర్కొంది. ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజుకీ ఇండియా ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యువత కార్లను కొని, ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని, దీనికి బదులు వారు ట్యాక్సీ సేవల వైపు మొగ్గుతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం చేసిన ప్రకటన పెద్ద చర్చకే తావిచ్చింది. ఓలా, ఊబర్‌ అంశం ప్రస్త్తుత మందగమనానికి పెద్ద కారకం కాదన్నారు శ్రీవాస్తవ. ‘‘ఓలా, ఊబర్‌ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఊబర్‌ వల్లేనని ఆలోచించకండి’’ అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఊబర్‌ బలమైన ప్లేయర్‌గా ఉన్నప్పటికీ, అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆకాంక్ష మేరకే... 
‘‘భారత్‌లో 46 శాతం మంది కార్లు కొనే వారు, మొదటి సారి కొనుగోలుదారులే. ఇది కారు కొనాలన్న వారి ఆకాంక్షల వల్లే. ప్రజలు ఓలా, ఊబర్‌ ద్వారా వారం రోజులు ప్రయాణించినా కానీ, వారాంతంలో కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ చెప్పారు. ఆటో మార్కెట్‌ మందగమనానికి ఎన్నో కారణాలున్నాయని శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లో లిక్విడిటీ (నిధులు/రుణాలు) కొరత, నియంత్రణపరమైన అంశాల వల్ల (భద్రతా ఫీచర్ల అమలు వంటి) ఉత్పత్తుల ధరలు పెరగడం, అధిక పన్నులు, బీమా ప్రీమియం రేట్లు పెరగడాన్ని కారణాలుగా పేర్కొన్నారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు దీర్ఘకాలానికి పరిశ్రమకు మేలు చేసేవని, ప్రస్తుత మందగమనానికి బ్రేక్‌ వేసేందుకు చాలవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న పండుగల అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాను ప్రకటించారు. వాహన పరిశ్రమ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం ఆగస్ట్‌లో దేశీయ వాహన విక్రయాలు 23.55 శాతం తగ్గి 18,21,490 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు చూస్తే 16 శాతం తగ్గి 97,32,030 యూనిట్లుగా ఉన్నాయని శ్రీవాస్తవ వెల్లడించారు. You may be interested

తగ్గిన చమురు

Friday 13th September 2019

యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుధ్దం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు తగ్గుతుండడంతో శుక్రవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 17 సెంట్లు లేదా 0.3 శాతం క్షీణించి బ్యారెల్‌ 60.21 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్ల్యుటీఐ క్రూడ్‌ 14 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి బ్యారెల్‌ 54.95 డాలర్లకు చేరుకుంది.    ‘యుఎస్‌, చైనా మధ్య వివాదం ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా ఆర్గనైజేషన్

కారు... పల్లెటూరు..!

Friday 13th September 2019

-మందగమనంతో తగ్గిన డిమాండ్‌ -ఇరవైఏళ్ల కనిష్టానికి వాహన విక్రయాలు  -అమ్మకాల కోసం పల్లెబాటలో వాహన కంపెనీలు  -ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు -అమ్మకాలు పుంజుకుంటాయని ఆశలు  -గ్రామ మహోత్సవాల నిర్వహణ  -తక్కువ వడ్డీరేట్లకు రుణాలు -ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు -సేల్స్‌, సర్వీస్‌ సెంటర్ల ఏర్పాటు  పల్లెకు పోదాం.. పారును చూద్దాం.. ఛలో..ఛలో అని అప్పుడు దేవదాసు పల్లెబాట పట్టాడు. ఇప్పుడు వాహన కంపెనీలు కూడా పల్లె బాట పడుతున్నాయి. పల్లెకు పోదాం.... మందగమనాన్ని తట్టుకుందాం... అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను

Most from this category